తరుణ్ ఒకప్పుడు రొమాంటిక్ హీరో. నువ్వే కావాలి వంటి సూపర్ హిట్ సినిమా తో అమ్మాయిలంతా నువ్వే కావాలి అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత వరుసగా ఎన్నో రొమాంటిక్ కామెడీ చేశాడు. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, శశిరేఖా పరిణయం, నువ్వు లేక నేను లేను, ఒక ఊరిలో వంటి సినిమాలు తరుణ్‌కి మంచి పేరు తెచ్చాయి. కాకపోతే ఒకే తరహా గెటప్, ఒకే తరహా మాటతీరు, ఒకే తరహా కథలు అతన్ని వెనక్కి లాగేసి,కెరీర్ లో  ముందుకు వెళ్ళకుండా చేసేసాయి.   అతను పూర్తిగా వెనుకబడి పోయాడు.సర్లే ఖాళీగా ఉన్నాను కదా అని వేరే వ్యాపారాల్లో కాలు పెట్టి బిజీ అవటం మొదలెట్టాడు. అందులో భాగంగా ఓ పబ్ కూడా పెట్టాడని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అఫ్ కోర్స్ మాజీ  హీరో కదా అతనిపై  ఇంకా రకాల వార్తలు వచ్చాయి. కాకపోతే అవేమీ అతని వెనుకబడిపోయిన కెరీర్ ని మాత్రం తిరిగి తేలేకపోయాయి.  మరి ఏం చేయాలి ఒకసారి ముఖానికి రంగు వేసుకున్న తర్వాత,కెమెరా ముందుకు వచ్చాక..ఖాళీగా ఉండటం కష్టం. 

 సినీ పరిశ్రమలోకి వచ్చాక ఎవరైనా సరే వెనక్కి వెళ్లటం చాలా కష్టం. జీవితం ఆఖరి క్షణం దాకా అక్కడే సెట్లో నే కుర్చీ వేసుకుని కూర్చోవాలనిపిస్తుంది. అందుకేనేమో తరుణ్  మళ్ళి మళ్ళి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చివరిసారిగా 2018లో కన్నడంలో సూపర్ హిట్టయిన ‘సింపుల్లగిఒన్దు లవ్ స్టొరీ’  అనే సినిమాని తెలుగులోకి రీమేక్ చేశాడు ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో తను తను హీరోగా పనికి రానేమో అనే ఆలోచనలో పడ్డాడో లేదో కానీ ఏ నిర్మాత అతనితో చేసే ధైర్యం చేయలేదు. 

ఇప్పుడు ఏం చేయాలి చేతిలో ఒక్క ప్రాజెక్టూ లేదు. అలాగని రీఎంట్రీ ఇచ్చి సినిమాల్లో హీరోగా కొనసాగటం కష్టం. అలాగని వ్యాపారంలో బిజీగా లేడు. ఖాళీగా ఉన్నాడు. రీసెంట్ గా నువ్వే కావాలి 25 సంవత్సరాల వేడుకలో ఒకసారి కనిపించాడు.  జనం, మీడియా అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు. దాంతో మళ్ళీ తన గమ్యం సినిమాలే అనిపించిందట. ఇప్పుడు హీరోగా ఆఫర్స్ కోసం ఎదురుచూసే కన్నా ...ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్దానం ఉండేలా ప్లాన్ చేసుకోవటం బెస్ట్. ఈ క్రమంలో తరుణ్ ఓ డెసిషన్ కు వచ్చారట. అది నిర్మాతగా మారటం.   

నిర్మాతగా తరుణ్ ..ఒకేసారి మూడు ప్రాజెక్టులు సెట్ చేసినట్టు చెబుతున్నారు. వీటిలో ఒకటి థియేట్రికల్ రిలీజ్ కోసం కాగా.. మరో రెండు సినిమాల్ని నేరుగా ఓటీటీకి ఇచ్చేలా  ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు తన అనుభవాన్ని రంగరించి..ఈ మూడు కథల్ని తరుణ్ ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే  నిర్మాతగా మారాను కదా అనే యాక్టింగ్ మాత్రం వదిలిపెట్టను అంటున్నారు. ఓ వైపు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా  ఏదైనా మంచి క్యారెక్టర్ చేయడానికి ఉన్నానంటున్నాడు.   ఏమో ఎవరికి తెలుసు హీరోలు-విలన్స్ అవుతారు, హీరోలు నిర్మాతలు అవుతారు నిర్మాతలు హీరోలు అవుతుంటారు ఇక్కడ ఇప్పుడు ఏదైనా జరగొచ్చు .