ఇప్పుడున్న సీనియర్ హీరోలతో పోటీపడి హీరోగా స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయిన స్టార్ సుమన్. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి మంచి సినిమాలు చేసిన సుమన్ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  

ఇప్పుడున్న సీనియర్ హీరోలతో పోటీపడి హీరోగా స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయిన స్టార్ సుమన్. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి మంచి సినిమాలు చేసిన సుమన్ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

హీరోగా ఫేడ్ అవుట్ అయిన తరువాత సినియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమన్ ఓ స్పెషల్ ఇమేజ్ ను సాధించారు. ఆ నాటి హీరోలకు పోటీ ఇచ్చిఫ్యామీ హీరోగా.. యాక్షన్ స్టార్ గా ఎదిగిన సుమర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెటింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఒక హీరోగా ఉన్న ఆయన తనకు మాత్రం కమలహాసన్ అంటే చాలా ఇష్టం అన్నారు. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా సుమన్ మాట్లాడారు. 

డాన్స్ విషయానికొస్తే చిరంజీవిగారి డాన్స్ బాగా నచ్చుతుందన్నారు సుమన్. ఇండస్ట్రీ మొత్తం మీద నేల చూడకుండా డాన్స్ చేసే స్టార్ చిరంజీవిగారు మాత్రమే అన్నారు సుమన్. అంతే కాదు ఆయన డాన్స్ చేసేటప్పుడు ఆయన బాడీలో ఒక రిథమ్ ఉంటుంది .. ఒక గ్రేస్ ఉంటుంది. చాలా మంది కుర్రాళ్లు ఇప్పుడు అంతకంటే ఫాస్టుగా చేస్తున్నారు. అయితే వాటిలో డాన్స్ కంటే కూడా జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నారు. 

ఇక చిరంజీవి తరువాత అంత బాగా డాన్స్ చేసే హీరోగా ఎవరికి ఎక్కవు మార్కులు ఇస్తారు అంటే.. ఇప్పడు ఉన్న యంగ్ స్టార్స్ లో మెగాస్టార్ తరువాత అంతలా డాన్స్ చేసేది ఎన్టీఆర్ అన్నారు సుమన్. ఆయనలో కూడా ఆ రిధమ్ ఉంది అన్నారు. ఇక ఇవే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయాలు పంచుకున్నారు సుమన్. 

తెలుగు తెరపై మార్షల్ ఆర్ట్స్ తో విజృంభించిన హీరోల జాబితాలో సుమన్ ఒకరుగా కనిపిస్తారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కథల్లో అర్జున్ ,భానుచందర్ తొ పాటు సుమన్ కూడా ఒక ప్రత్యేకమైన ముద్రవేశారు. కొంతకాలం తరువాత అర్జున్ తో పాటు భానుచందర్ తమిళ సినిమాల్లోకి వెళ్లిపోగా సుమన్ మత్రం టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా స్టార్ట్ చేసి.. ఫ్యామిలీ హీరోగా ఎదిగారు.. ఇప్పటి సీనియర్ హీరోలకు ఒకప్పుడు అయన గట్టిపోటీ ఇచ్చారు.