రజనీకాంత్ చేసిన ప్రసంగంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి కొత్త రూపం తీసుకొచ్చింది చంద్రబాబేనంటూ వ్యాఖ్యానించారు. ప్రధాన రూపశిల్పి ఆయనే అంటూ తెలిపారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుని రజినీ పొగుడుతూ ప్రసంగించారు. అది జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రులు, వైస్సార్‌సీపీ నేతలు రజినీకాంత్‌ను టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తమిళ నటుడికి ఏం తెలుసంటూ విమర్శలు చేసారు. అయితే చంద్రబాబు గురించి రజినీకాంత్ చేసిన ప్రసంగంలో తప్పేమీ లేదంటున్నారు తెలుగు నటుడు సుమన్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
రజినీకాంత్ తన ప్రసంగంలో ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదని.. అలాంటప్పుడు వైఎస్సార్‌సీపీ నేతలు ఆయన్ను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిపై రజనీకాంత్ చేసిన ప్రసంగంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి కొత్త రూపం తీసుకొచ్చింది చంద్రబాబేనంటూ వ్యాఖ్యానించారు. ప్రధాన రూపశిల్పి ఆయనే అంటూ తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ రంగం రావడంతో ఇంతమంది ఉపాధి పొందుతున్నారంటే అవన్నీ చంద్రబాబు వేసిన ప్రణాళికే వల్లే జరిగిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒడుదొడుకులు ఉంటాయని.. ఆయన మంచి ముఖ్యమంత్రి అంటూ సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే రజనీకాంత్ తన ప్రసంగంలో ఏ పార్టీని, నాయకుడ్ని కూడా విమర్శించలేదని చెప్పారు. సీఎం జగన్ గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురానప్పటికీ.. వైకాపా నేతలు మాత్రం ఆయన్ను విమర్శించారని ఇలా చేయడం సరికాదన్నారు. సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
