ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలపై చావు వార్తలు పుట్టిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి వార్తలకు సీనియర్ నటి రేఖ కూడా బలైంది. తాజాగా ఈ విషయంపై స్పదించిన ఆమె కుటుంబసభ్యులతో సంతోషంగా ఉన్న తాను మరణించనట్టు పుట్టించిన వదంతుల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేసింది.  

చంద్రమౌళి దర్శకత్వంలో జీవీ ప్రకాష్‌, షాలిని పాండే నటించిన  ‘100 శతవిదమ్‌ కాదల్‌’అనే సినిమాలో రేఖ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో రేఖ పాల్గొని మాట్లాడారు.

తాను మరణించినట్టు ఆగస్టు 17వ తేదీ నుంచి వదంతులు పుట్టిస్తున్నారని.. చాలా మంది యూట్యూబ్ చానెల్స్ మొదలుపెట్టి అనవసరమైన విషయాలను ప్రసారం చేస్తూ లబ్ది పొందుతున్నారని ఫైర్ అయింది. సినీ సెలబ్రిటీల గురించి ఇలాంటి వదంతులు పుట్టిస్తోన్న సోషల్ మీడియాకి అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.