మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ హీరోయిన్ కుష్బూ.. రీసెంట్ గా తాను లైంగిక దాడికి గురయ్యాను అని ప్రకటించుకున్న సీనియర్ స్టార్.. ఆ వ్యాఖ్యలకు రిలేటెడ్ గా మరికొన్ని వ్యాఖ్యలు చేసింది.
మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ హీరోయిన్ కుష్బూ.. రీసెంట్ గా తాను లైంగిక దాడికి గురయ్యాను అని ప్రకటించుకున్న సీనియర్ స్టార్.. ఆ వ్యాఖ్యలకు రిలేటెడ్ గా మరికొన్ని వ్యాఖ్యలు చేసింది.
తెలుగు తమిళ భాషల్లో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది కుష్బూ. సీనియర్ స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ.. రెండు భాషల్లో స్టార్ డమ్ ను చూసింది. ఇక రాను రానువారి ప్రభావం తగ్గడంతో..క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. ఇప్పుడు కూడా అదే ఇమేజ్ ను మెయింటేన్ చేస్తోంది. అటుపాలిటిక్స్.. ఇటు సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. దూసుకుపోతోంది కుష్బుూ. ఇక కుష్బుపై ఇప్పటికే చాలా కాంట్రవర్సీలు ఉండగా.. ఆమె చేసే కామెంట్స్ కూడా వివాదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా తన మీద చిన్నతనంలో జరిగి లైంగిక దాడి గురించ వివరించిన కుష్బూ.. ఆ వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.
తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి ఇటీవల నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు తాను ఏమాత్రం సిగ్గుపడం లేదన్నారు. నిజం చెప్పాలంటే నేను చెప్పిన దానిలో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా, నిజాయితీగా అందరికీ తెలిసేలా చెప్పాను. దానికి నేను ఏమాత్రం సిగ్గు పడటంలేదు అని అన్నారు కుష్బూ.
ఈ ఘటనలో నేను బాధితురాలిని.. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి నా తండ్రి కాబట్టి.. అతను సిగ్గుపడాలి. అలాగే మహిళలందరూ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ఏమాత్రం సహించవద్దు.. పొరపాటున కూడా వాటిని ఏమాత్రం ఎంకర్నేజ్ చేయకూడదన్నారు. ఈ విషయం చెప్పడానికి నేను చాలా టైమ్ తీసుకున్నాను. కాని ఇలాంటివి ఇంకెవరికైనా ఎదురైతే.. వెంటనే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పండీ అంటూ యూత్ కు మెసేజ్ ఇచ్చారు
ఇక అసలు విషయం ఏంటీ అంటే.. స్టార్ హీరోయిన్ ఖుష్బూ.. రీసెంట్ గా సంచలనవ్యాఖ్యలు చేశారు. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు అది కూడా తన కన్నతండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అయితే అప్పుడు తన వయసు ఎనిమిదేళ్లని, పదిహేనేళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని చెప్పింది. దాంతో ఆయన తన ఫ్యామిలీని వదిలేసి బయటకు వెళ్లిపోయాడని.. అలా ఎదురించకపోతే..ఇంకెన్నాళ్లు తనపైఇలా దాడి జరిగి ఉండేది అన్నారు కుష్బు. దాంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి
