సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కి గురయ్యింది. మూడు రోజులుగా హ్యాకింగ్ అయ్యిందని నటి ఖుష్బు వెల్లడించారు.
సీనియర్ నటి ఖుష్బు సుందర్ ట్విట్టర్ మరోసారి హ్యాకింగ్‌కి గురయ్యింది. ఈ సారి హ్యాకర్లు ఆమె అకౌంట్ పేరుని `బ్రియాన్`గా మార్చారు. కవర్ ఫోటోని సైతం మార్చేశారు. గతంలో ఆమె చేసిన ట్విట్లని తొలగించారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు ఖుష్బు సుందర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. మూడు రోజులుగా తన అకౌంట్ హ్యాక్‌కి గురయ్యిందని, 48 గంటల నుంచి తాను పాస్‌వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ సాధ్యం కావడం లేదని తెలియజేస్తూ, తనకు సహాయం చేయాలని అభిమానులను కోరింది ఖష్బు.
ఈ విషయాన్ని ట్విట్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మూడు రోజులు పెట్టిన పోస్టులు నావి కావు. గమనించగలరు` అని తెలిపింది. ఇదిలా ఉంటే గతేడాది ఏప్రిల్‌ళోనూ ఖుష్బు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కి గురయ్యింది. ఇప్పుడు ఆమె పేరుతోనే ట్విట్టర్ అకౌంట్ కనిపిస్తుంది. కవర్ పేజ్‌లో ఎలాంటి పోస్టర్ లేవు. అయితే ఇది సెట్ అయ్యిందా లేదా? అన్నది ఆమె నిర్ధారించాల్సి ఉంది.
నటిగా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంది ఖుష్బు. బీజేపీలో ఆమె యాక్టివ్ లీడర్‌గా ఉన్నారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న `అన్నాత్తే` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది ఖుష్బు.
