సీనియర్ నటి కాంచన దర్శకుడు రాజమౌళిని ఉద్దేశిస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఐదు లక్షల రూపాయల కోసం నన్ను అవమానించారని ఆరోపించారు.  

తెలుగు సినిమా రెండో తరం హీరోయిన్స్ లో కాంచన ఒకరు. హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. కాంచన దర్శకుడు రాజమౌళి మీద ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాంచన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె రాజమౌళి ప్రస్తావన తెచ్చారు. రాజమౌళి బాహుబలి చిత్రంలో ఒక పాత్ర కోసం నన్ను సంప్రదించారు. రెండు రోజులు షూట్ ఉంటుందన్నారు. నేను రూ. 5 లక్షలు డిమాండ్ చేశాను. 

రాజమౌళి అది చాలా ఎక్కువ. మీ పాత్రకు అంత ఇవ్వడం కుదరదన్నారు. రూ. 5 లక్షలు రాజమౌళికి పెద్ద విషయం కాదు. ఆయన దగ్గర లేని డబ్బా. కానీ మాకు అది పెద్ద అమౌంట్. మాకు ఇస్తే సేవ(దేవుని) చేసుకుంటాం కదా. ఐదు లక్షల కోసం నన్ను ఆయన పక్కన పెట్టేశారు. అవమానించారు. ఇలా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నాతో పాటు పలువురు సీనియర్ నటులు ఉన్నారు. పాత్రలు ఇస్తే చేయగలం అంటూ ఆమె తన అసహనం బయటపెట్టారు. ఆర్టిస్టులు అనేక కష్టాలు పడుతున్నట్లు ఆమె మాటల్లో మాటగా చెప్పారు. 

కాంచన తండ్రి వ్యాపారవేత్త. ఆయన బిజినెస్ లో నష్టపోతే ఎయిర్ హోస్టెస్ గా కాంచన జాబ్ చేసి ఫ్యామిలీని పోషించేవారట. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయాలు ఆమెను నటన వైపు మళ్లించాయి. తండ్రితో ఆమెకు ఆస్తి వివాదం నడిచింది. ఏళ్ల తరబడి సాగిన కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. చెన్నైలో కోర్టు ద్వారా తిరిగి సంక్రమించిన ఆస్తిని కాంచన తిరుమల తిరుపతి దేవస్థానంకి రాసిచ్చారు. కాంచన వివాహం చేసుకోలేదు. ఆమెకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. దైవ సేవ చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. హైదరాబాద్ లో సెటిలైన కాంచన చాలా గ్యాప్ తర్వాత అర్జున్ రెడ్డి మూవీలో నటించారు. అర్జున్ రెడ్డిలో హీరో విజయ్ దేవరకొండ నానమ్మ పాత్ర చేశారు.