Asianet News TeluguAsianet News Telugu

పెళ్ళికి ముందు ఆ హీరోతో నాలుగేళ్లు ఎఫైర్... హీరోయిన్ కుష్బూ పర్సనల్ మేటర్స్ పై నటి కీలక వ్యాఖ్యలు!

రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన తెలుగు నటి కాకినాడ శ్యామల తాజా ఇంటర్వ్యూలో ప్రభు-కుష్బూ రిలేషన్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

senior actress kakinada shyamala shocking comments heroine Khushbu Sundar personal affairs ksr
Author
First Published Apr 12, 2023, 9:53 AM IST | Last Updated Apr 12, 2023, 10:07 AM IST

హీరోయిన్ కుష్బూ ఇండియన్ వైడ్ పాపులారిటీ ఉన్న నటి. ఈమె  వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. నటుడు ప్రభుతో ఆమె రిలేషన్ వేదన మధ్య ముగిసింది. 1986లో తెలుగు మూవీ కలియుగ పాండవులు తో హీరోయిన్ గా కుష్బూ కెరీర్ మొదలైంది. ముంబైలో పుట్టిపెరిగిన కుష్బూ కోలీవుడ్ లో స్టార్ గా ఎదిగారు. సౌత్ ఇండియా అన్ని భాషలతో పాటు హిందీలో కూడా చిత్రాలు చేశారు. 1991లో కుష్బూ,ప్రభు జంటగా చిన్ని తంబీ చిత్రంలో నటించారు. అంతకు ముందు నుండే వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు కుష్బూ వ్యాఖ్యలను బట్టి అర్థమైంది. గతంలో ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుష్బూ నటుడు ప్రభుతో తన రిలేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు. 

ప్రభుతో నాలుగేళ్లు నేను రిలేషన్ లో ఉన్నాను. 1993లో పోయేస్ గార్డెన్ లోని ఆయన నివాసంలో మా వివాహం జరిగింది. అప్పటికే ప్రభుకి వివాహం కాగా ఆయన తండ్రి శివాజీ గణేశన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి భార్యతో వివాదాలు చోటు చేసుకున్నాయి. అందుకే పెళ్ళైన నాలుగు నెలలకే విడిపోవాల్సి వచ్చిందని కుష్బూ తెలిపారు. 

senior actress kakinada shyamala shocking comments heroine Khushbu Sundar personal affairs ksr

రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన తెలుగు నటి కాకినాడ శ్యామల తాజా ఇంటర్వ్యూలో ప్రభు-కుష్బూ రిలేషన్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కుష్బూ చాలా మంచి అమ్మాయి. ప్రభుని ఘాడంగా ప్రేమించింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. అందుకే పెళ్ళైన ప్రభుని వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహం ప్రభు కుటుంబంలో వివాదాలకు దారి తీసింది. ఆ కారణంగా ప్రభు-కుష్బూ విడిపోయారని ఆమె అన్నారు. 

కుష్బూ రెండో వివాహం దర్శకుడు నటుడు సి. సుందర్ ని చేసుకున్నారు. 2000లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. కుష్బూ ఇటీవల కన్న తండ్రి మీద  లైంగిక ఆరోపణలు చేశారు. కుష్బూ కామెంట్స్ సంచలనం రేపాయి.కుష్బూ పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరిన కుష్బూ అనంతరం బీజేపీలోకి వచ్చారు. ప్రస్తుతం జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. గత ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు.

senior actress kakinada shyamala shocking comments heroine Khushbu Sundar personal affairs ksr

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios