ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు, ఆస్కార్.. భాస్కార్ అంటూ రెచ్చిపోయిన నటుడు
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలచిన నటులలో ప్రకాశ్ రాజ్ ఒకరు. ఆయన కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కోట్టినట్టుగా.. ముక్కు సూటిగా చెప్పేస్తుంటారు. ఈక్రమంలో ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలచిన నటులలో ప్రకాశ్ రాజ్ ఒకరు. ఆయన కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కోట్టినట్టుగా.. ముక్కు సూటిగా చెప్పేస్తుంటారు. ఈక్రమంలో చాలా సంచలనాలకు ఆయన కేంద్ర బింధువు అయ్యారు. ఇటు సినిమాల్లో.. అటు రాజకీయాల్లో కూడా కాంట్రవర్సీ కింగ్ గా ప్రకాశ్ రాజ్ పేరు మారుమోగుతుంటుంది. విలక్షణ నటుడిగా పేరున్న ఆయన.. వివాదాస్పద వ్యాక్తిగా కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఈక్రమంలో ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ప్రకాశ్ రాజ్ కేరళ కేంద్రమైన తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ఈవెంట్ లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ ప్రస్తావన తెచ్చిన సీనియర్ నటుడు.. ఆ సినిమాను బ్యాన్ చేయాలని ట్రోల్ చేసినవారికి చురకలంటించారు.
బాయి కాట్ ట్రెండ్ ను వైరల్ చేస్తున్నవారిని ఉద్దేశిస్తూ.. ప్రకాష్ రాజ్ ఇలా అన్నారు. పఠాన్ మూవీని బ్యాన్ చేయాలన్న ఈ ఇడియట్స్, బిగాట్స్ ఎవరైతే ఉన్నారో.. వాళ్ళు చూస్తున్నారో లేదా ...ఇప్పుడా సినిమా 700 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది. మరి పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలని గోల చేసినవారికి తెలియదా.. మోదీ సినిమాకు కనీసం 30 కోట్లు కూడా ఎందుకు రాలేదో అని అన్నారు.
ఇలాంటివారు కేవలం మొరుగడానికే పనికొస్తారు.. వారికి కరవడం చేతకాదు.. జస్ట్ సౌండ్ పొల్యూషన్ అంటూ.. విరుచుకుపడ్డారు ప్రకాశ్ రాజ్. ఇక ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై కూడా గట్టిగానే విరుచుకుపడ్డారు ప్రకాష్ రాజ్. ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఆస్కార్ రావాలని అడుగుతున్నాడు కాని ఈసినిమాకు అస్కార్ సంగతి పక్కన పెడితే.. అతనికి భాస్కర్ అవార్డు కూడా రాదంటూ కామెంట్స్ చేశారు ప్రకాశ్ రాజ్.
అంతటితో వదిలి పెట్టలేదు ప్రకాశ్ రాజ్. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్అనే సినిమా నాన్ సెన్స్ మూవీస్ లో ఒకటి అన్నారు. ఈ సినిమా చేయడం చాలా సిగ్గుచేటు అంటూనే.. ఇంటర్నేషనల్ జ్యూరీనే మూవీ మేకర్స్ పై ఉమ్మేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్. ఇలాంటి సినిమాలు చేసి ఒక సారి జనాల్ని పిచ్చివారిని చేయగలరేమో కాని.. ప్రతిసారి జనాల్ని ఫూల్ చేయలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్ .