టాలీవుడ్ సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాల వల్ల ఆయన మాతృమూర్తి మరణించారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాల వల్ల ఆయన మాతృమూర్తి మరణించారు.

తెలుగు సినీ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాల వల్ల ఆయన తల్లి గోగినేని కమలమ్మ బుదవారంకన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు. వీరిలో రాఘవ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉంటున్నారు. కమలమ్మ అంత్యక్రియలు చిన్న కుమారుడు వెంకట్ వచ్చిన తరువాత.. ఈరోజు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

మరోవైపు రాఘవకు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ. మహర్షి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇంటిపేరు కూడా మహర్షిగామారిపోయింది. ఇక హీరోగా.. కమెడియన్ గా...క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా విలన్ గా కూడా వదల సినిమాల్లో నటించి మెప్పించారు రాఘవ. కొన్ని టెలివిజన్ సీరియల్స్ ద్వారా కూడా ఆడియన్స్ ను అలరించారు రాఘవ. ఆతరువాత అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం తెరమరుగయ్యారు ఆయన.