సీనియర్ నటి ఖుష్బు కన్నీరు పెట్టారు. అవును తనపై ఓ నాయకుడు చేసిన అసభ్య కామెంట్లకు ఆమె నొచ్చుకున్నారు.. కన్నీరు మున్నీరు అయ్యారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?
సౌత్ సీనియర్ నటి కుష్బు కన్నీరు పెట్టారు. తిమళనాట గుడి కట్టేంత అభిమానులు ఉన్న ఆమెను.. ఒ వ్యక్తి నోటికి వచ్చినట్టు మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. అంతే కాదు.. అసభ్య పదజాలంతో కుష్బును నానా మాటలు అన్న ఆ వ్యాక్తి డీఎంకే పార్టీకి చెందిన వాడు కావడంతో.. ఈన్యూస్ రాష్ట్రమంతా వైరల్ అయ్యింది. దాంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చ జరిగింది. ఈ పరిణామాలతో కలత చెందారు కుష్బు. కన్నారుమున్నీరు అయ్యారు.
తమిళనాట రాజకీయాలు ఒక్కోసారి చాలా గలీజ్ గ మారుతుంటాయి. ఒక్కోసారి కొంత మంది చేసే పనులు మొత్తం వ్యావస్తనే ప్రభావితం చేస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే కి చెందిన పార్టీ నాయకుడు క్రిష్ణమూర్తి.. ప్రముఖ నటి, తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఖుష్బూపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దేశ వ్యాప్త చర్చనీయాంశంగా మారాయి.
ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఖుష్బూపై హద్దులు దాటి విమర్శలు చేశారు. ముఖ్యంగా కుష్బు ని వ్యాక్తి గతంగా టార్గెట్ చేశాడు. ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజంగా ఇలాంటి నటిని తాను చూడలేదంటూ వెటకారం చేశాడు. అంతే కాదు. మాజీ హీరో.. ప్రస్తుం క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ప్రభు తో కుష్బుకు అఫైర్లు అంటగడుతూ... రకరకాల కామెంట్లు చేవారు. . ప్రభుతో ఆమె గతం తాలూకా సంబంధాన్ని లేవనెత్తారు. ఈ విషయంపై కూడా దారుణంగా మాట్లాడారు.
ఇక ప్రస్తుతం వైరల్ అవుుతన్న ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌అవుతోంది. వైరల్‌గా మారిన వీడియోపై డీఎంకే పార్టీ అధిష్టానం హుటాహుటిన స్పందించింది. కుష్బుపౌ ఇలా తీవ్రస్థాయిలో మాట్టాడిన డిఏంకే కార్యకర్తం క్రిష్ణమూర్తిని పార్టీనుంచి శాశ్వతంగా తొలగించింది. అయితే ఈ విషయంలో మాత్రం కూష్బు బాగా బాధపడుతోంది. తనపై ఇలా అసత్య ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటోంది.
వ్యాఖ్యలపై ఖుష్బూ తాజాగా స్పందించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ క్రిష్ణమూర్తిపై ఫైర్ అయ్యారు. ఒకానొక సందర్భంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేను మహిళల కోసం పోరాటం చేస్తూ ఉన్నాను. అలాంటి నాపై చేసిన ఈ వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా ఉంటే అది తప్పుగా అర్థం అవుతుంది.బయటి ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి కూడా ఆలోచించండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఎలాంటి మగాళ్లతో జీవిస్తున్నామో ఓ సారి ఆలోచించండి అన్నారు.
