రాజమౌళి బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయ్యారు. డబ్బులు పరంగా, ఫేమ్ పరంగా భారీగా ఆర్జించారు. ఆ సినిమా వచ్చింది, మంచి సక్సెస్ సాధించింది. కానీ ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడుకునేవారు ఎవరున్నారు. ఒకప్పటి మాయాబజార్ టీవీలో వస్తుంది అంటే... ఇప్పటికి కూడా విశేషంగా చెప్పుకుంటారని కోటా తన అభిప్రాయం తెలియజేశారు

సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలపై స్పందించారు. ఒకప్పటి చిత్ర చిత్రాలు, నేటి చిత్రాల మధ్య పోలిక గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమ తల్లిపాల వంటిది, నేడు అది డబ్బా పాలు మాదిరి మారిపోయింది. ఒకప్పటి సినిమాకు నేటి సినిమాకు అంత వ్యత్యాసం ఉందని కోటా అన్నారు. 


రాజమౌళి బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయ్యారు. డబ్బులు పరంగా, ఫేమ్ పరంగా భారీగా ఆర్జించారు. ఆ సినిమా వచ్చింది, మంచి సక్సెస్ సాధించింది. కానీ ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడుకునేవారు ఎవరున్నారు. ఒకప్పటి మాయాబజార్ టీవీలో వస్తుంది అంటే... ఇప్పటికి కూడా విశేషంగా చెప్పుకుంటారని కోటా తన అభిప్రాయం తెలియజేశారు. మాయాబజార్ లోకెమెరా ట్రిక్స్ తో తీసిన సన్నివేశాలు తీయడం నేటితరం వల్ల కాదు. తీయగలరు కానీ, కోట్లు ఖర్చుపెడతారని కోటా తెలియజేశారు. 


ఒకప్పుడు సినిమాలలో హాస్యం ఉండేదని, నేడు అది కామెడీగా మారింది అన్నారు. కుటుంబం మొత్తం చూడదగిన, అన్ని వర్గాల వారు మాట్లాడుకోదగిన దానిని హాస్యం అంటారు. కామెడీ అలాంటి కాదని కోటా తెలియజేశారు. ఇప్పటి సినిమాలలో కామెడీ ఉంటుంది కాబట్టే... కొన్ని చిత్రాలను ప్రత్యేకంగా కుటుంబ కథా చిత్రం అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారని కోటా గుర్తు చేశారు. ఏమీ తోచక త్రివిక్రమ్, ఎన్టీఆర్, మహేష్, వంశీ పైడిపల్లి వారిని వేషాల కోసం అడుగుతానని కోటా ఉన్న విషయం బయటపెట్టారు.