చిరు, పవన్ లేకపోతే అసలు నాగబాబు ఎవరండీ! ఓ రేంజ్ లో ఫైర్ అయిన కోట శ్రీనివాసరావు

నాగబాబు అసలు ఎవరు.. మంచి నటుడుగా, సక్సెస్ ఫుల్ పొలిటీషియనా?. ఒకప్రక్క Chiranjeevi, మరో ప్రక్క పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు స్థాయి ఏమిటని కోట ప్రశ్నించాడు.

senior actor kota fires on mega brother nagababu


సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మెగా బ్రదర్ నాగబాబుపై ఫైర్ అయ్యారు. గతంలో తనపై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు Nagababu ఎవరంటూ ప్రశ్నించారు. మా ఎన్నికలలో Kota srinivasaraoమంచు విష్ణుకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ప్రకాష్ రాజ్ పై కోట కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ తో కలిసి 15 చిత్రాలకు పైగా చేశానని, ఒక్కసారి కూడా షూటింగ్ కి సమయానికి వచ్చిన పాపాన పోలేదని.. కోట ఆరోపించారు. 


ప్రకాష్ రాజ్ పై నెగిటివ్ కామెంట్స్ చేసిన కోటను తీవ్ర పదజాలంతో నాగబాబు తిట్టారు. ఎప్పుడు పోతాడో కూడా తెలియని కోట నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అన్నారు. వాడు అసలు మనిషేకాదు.. జంతువు అంటూ, ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగబాబు అప్పటి వ్యాఖ్యలకు కోట ఇప్పుడు స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట నాగబాబు పై ఫైర్ అయ్యారు. 


నాగబాబు అసలు ఎవరు.. మంచి నటుడుగా, సక్సెస్ ఫుల్ పొలిటీషియనా?. ఒకప్రక్క Chiranjeevi, మరో ప్రక్క పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు స్థాయి ఏమిటని ప్రశ్నించాడు. గతంలో ప్రకాష్ రాజ్ ని బండబూతులు తిట్టాడు. అతని వల్ల షూటింగ్ షెడ్యూల్స్ మారిపోతున్నాయి, క్రమశిక్షణ లేదని ఆరోపించాడు. మా ఎన్నికలలో అతనికి సప్పోర్ట్ చేశాడు అన్నారు. అసలు నాగబాబును నేను ఏమైనా అన్నానా? నేను కూడా అలాగే మాట్లాడితే పెద్ద రాద్ధాంతం చేసేవారు, టీవీలలో డిబేట్లు పెట్టేవారని కోట.. తన ఆవేదన వ్యక్తం చేశారు. 

Also read అనసూయ బట్టలపై కోటా ఘాటు వ్యాఖ్యలు... బోల్డ్ యాంకర్ ఊరుకుంటుందా... పెద్దవాడని కూడా చూడకుండా ఇచ్చిపడేసింది!
మరి కోట వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇస్తారో లేక వదిలేస్తారా చూడాలి. మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, నాగబాబు మద్దతు ప్రకటించిన Prakash raj ఓడిపోయారు. దీనికి నిరసనగా నాగబాబు తన మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సంకుచిత స్వభావం కలిగిన మా లో సభ్యునిగా ఉండడం ఇష్టం లేకే.. ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు.
Also read అల్లు అర్జున్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios