సీనియర్ నటుడు కార్తీక్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ నటుడు కార్తీక్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్తీక్ ఇటీవల శాస్వసంబంధిత సమస్యలతో, రక్తపోటు కారణంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేశారు. కొన్ని రోజులపాటు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆయన తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో పాల్గొనడంతో మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఎమర్జెన్సీ విభాగంలో వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తుంది.
కార్తీక్ కొన్ని రోజుల క్రితం రాజకీయ పార్టీ పెట్టారు. సినిమాలకు దూరంగా ఉండి మరీ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. కానీ పొలిటికల్‌గా అంతగా రాణించకపోవడంతో కొంత కాలం తర్వాత రాజకీయాలు వదిలేశారు. మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టారు. పలు సినిమాల్లో నటించారు. అయితే తమిళనాడు ఎన్నికల దృష్ట్యా ఆయన అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలికారు. ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన గత నెల 21న అనారోగ్యానికి గురికావడం గమనార్హం. వైద్యులు ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. అయినా కార్తీక్ శ్వాసకోశ సమస్య తీవ్రత తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసిన కార్తీక్ తెలుగులోనూ పలు సూపర్ హిట్స్ లో నటించారు. ఆయన `సీతాకోక చిలుకా`, `అనుబంధం`, `అన్వేషణ`, `పుణ్యస్త్రీ`, అభినందన`, `మగరాయుడు`, `ఓం 3డీ` చిత్రాలో నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఇటీవల కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
