సీనియర్ నటుడు బత్తుల వీరవెంకట రంగారావు అలియాస్ రాంబాబు(82) బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

రాంబాబు.. ఎస్వీ రంగారావుకి అత్యంత ఆప్తమిత్రుడు. పలు పాత చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు రాంబాబు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ ఆఫీస్ మేనేజర్గా సుదీర్ఘకాలం పని చేశారు. రాంబాబు మృతికి రేడియో, టీవీ  గాయకులు దాసరి సత్యనారాయణ సంతాపం తెలిపారు.