టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలు మిగిలిన దర్శకులకంటే విభిన్నంగా ఉంటాయి. శేఖర్ కమ్ముల చిత్రాలు యువతకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంటాయి. కానీ రెగ్యులర్ సినిమాల్లో కనిపించే సినిమాటిక్ లవ్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆయన చిత్రాల్లో ఉండవు. లవ్ అయినా, రొమాన్స్ అయినా, ఎమోషన్ అయినా శేఖర్ కమ్ముల చిత్రాల్లో నేచురల్ గా ఉంటుంది. 

అందుకె శేఖర్ కమ్ముల ప్రత్యేక దర్శకుడయ్యారు. ఫిదా చిత్రంతో ఘనవిజయం అందుకున్న తర్వాత శేఖర్ కమ్ముల ఎలాంటి చిత్రం చేయాలో డైలమాలో పడ్డట్లు ఉన్నాడు. అందుకే రాంగ్ స్టెప్ వేశారు. హ్యాపీడేస్ తరహాలో మ్యాజిక్ చేయాలని అంతా కొత్త వారితో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సినిమా పూర్తి కాకముందే శేఖర్ కమ్ముల మరో చిత్రానికి ప్రకటన వచ్చింది. దీనితో శేఖర్ కమ్ముల కొత్త నటులతో చేస్తున్న సినిమా అటకెక్కినట్లు తెలుస్తోంది. 

ఏషియన్ గ్రూప్ సంస్థ నిర్మాణంలో శేఖర్ కమ్ముల ఆ చిత్రాన్ని ప్రారంభించారు. కొంతభాగం షూటింగ్ తర్వాత అవుట్ పుట్ తేడాకొడుతోందని ఈ దర్శకుడు గమనించాడు. దీనితో ఆ చిత్రాన్ని పక్కన పెట్టేసి నాగ చైతన్యతో ప్రెష్ గా మరో ప్రాజెక్ట్ ని ప్రారంభించబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.