కుబేర సినిమాలో నాగార్జున పాత్రపై ప్రశ్నలకు శేఖర్ కమ్ముల అన్నమయ్య చిత్రాన్ని ఉదాహరణగా సమాధానం ఇచ్చారు. రన్ టైం వస్తున్న విమర్శలపై కూడా క్లారిటీ ఇచ్చారు.
కుబేర మూవీ ఆడియన్స్ రియాక్షన్
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన కుబేర చిత్రం జూన్ 20 శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్ర రన్ టైం విషయంలో కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మూడు గంటలకు పైగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల సాగదీశారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.రన్ టైం పక్కన పెడితే ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల చాలా నిజాయతీతో అద్భుతమైన ప్రయత్నం చేశారని ప్రశంసిస్తున్నారు.
బిచ్చగాడి పాత్రలో ధనుష్, మాజీ సీబీఐ అధికారిగా నాగార్జున, విలన్ పాత్రలో జిమ్ సౌరబ్ నటనలో అదరగొట్టారు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ ఒదిగిపోయి నటించారు. తాజాగా కుబేర చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల, నాగార్జున అదేవిధంగా నిర్మాతలు పాల్గొన్నారు.
సక్సెస్ మీట్ లో నాగార్జున స్పీచ్
నాగార్జున మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రాలు వరుసగా సూపర్ హిట్స్ అవుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి కూడా అందరూ యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. సినిమా అంత బాగుంది కాబట్టే అంత మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నాను. ఈ విధంగా ఆ కోరిక తీరింది. ఎంతో అందమైన పాత్రని ఈ చిత్రంలో నాకోసం శేఖర్ రాశారు. మాయాబజార్ లో హీరో ఎవరంటే చెప్పడం కష్టం.. మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి చిత్రాల్లో హీరో ఎవరు అనేది ఎవరో చెప్పలేరు. అలాంటి చిత్రాలకు దర్శకుడే హీరో. కుబేర చిత్రానికి కూడా శేఖర్ కమ్ములనే హీరో అని నాగార్జున ప్రశంసించారు.
తన పాత్రలో మూడు వైవిధ్యమైన కోణాలు ఉన్నాయని నాగార్జున తెలిపారు. నా పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అందుకే ఈ చిత్రానికి అంగీకరించినట్లు నాగార్జున తెలిపారు.
నాగార్జున అన్నమయ్య చేసినప్పుడు ఇదే ప్రశ్న అడిగి ఉంటే..
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఈ కథ మొదలైనప్పుడే ఈ చిత్రాన్ని హానెస్ట్ గా, రియల్ లొకేషన్స్ లో హాలీవుడ్ స్థాయిలో తీద్దామని నిర్ణయించుకున్నట్లు శేఖర్ కమ్మలు తెలిపారు.
నేను చేసిన చిత్రాల్లో ఇదే నిజాయితీతో కూడుకున్న మంచి చిత్రం. నాగార్జున ని ఒక స్టార్ గా చూపించకుండా వైవిధ్యమైన పాత్రలో చూపించారు. ధనుష్, రష్మిక లని కూడా స్టార్లుగా చూపించలేదు. ఇలా చేయడానికి కారణం ఏంటి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి శేఖర్ కమ్ముల ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. నాగార్జున గారు అన్నమయ్య చేసినప్పుడు ఇలాంటి ప్రశ్న అడిగి ఉంటే ఎలాంటి సమాధానం వచ్చేది ?.. కుబేర చిత్రంలో కూడా అంతే అని శేఖర్ కమ్ముల అన్నారు.
రన్ టైం విషయంలో శేఖర్ కమ్ముల సమాధానం
ఈ చిత్ర నిడివి గురించి వస్తున్న విమర్శలకు శేఖర్ కమ్ములు సమాధానం ఇస్తూ.. తాను సినిమాలో చిన్న డైలాగ్ పెట్టినా దానిని తొలగిస్తే సినిమా మొత్తం పోతుంది అనే విధంగా ఉంటుంది. అంత ఆషామాషీగా సన్నివేశాలని పెట్టను అని శేఖర్ కమ్ముల సమాధానం ఇచ్చారు.
కలెక్షన్ల విషయానికి వస్తే ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా 22 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. షేర్ 11 నుంచి 13 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం యుఎస్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


