టీమిండియా ఆటగాళ్లు మంచి నటులు, మ్యాచ్ ఆల్రెడీ ఫిక్స్..ఆడుతున్నట్లు నటన, పాక్ నటి వక్ర బుద్ది చూశారా
ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ లో విజయం సాధించింది. ఫలితంగా టీమిండియా నాల్గవసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది.

ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ లో విజయం సాధించింది. ఫలితంగా టీమిండియా నాల్గవసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది. టీమిండియా అద్భుతంగా రాణిస్తుండడం పాకిస్తాన్ లో కొందరికి జీర్ణించుకోలేని అంశంగా మారింది.
ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఘోర వైఫల్యం చవిచూసిన సంగతి తెలిసిందే. దీనితో టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ పాకిస్తాన్ నటి షెహర్ షిన్వారి వరుస కామెంట్స్ చేస్తోంది. ఆమె ట్విట్టర్ లో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. భారత్ సాధిస్తున్న విజయాల్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తోంది.
ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆల్రెడీ ఫిక్స్ అయిందని.. అంతా భారత్ కి అనుకూలంగా జరిగిందని షెహర్ ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యాచ్ లో బాగా కష్టపడుతున్న టీమిండియా ఆటగాళ్లు సినిమా వాళ్ళ కంటే బాగా నటించారు.
త్వరలోనే బీసీసీఐ, బిజెపి సర్వనాశనం అవుతాయి అంటూ షెహర్ తనలోని అక్కసు వెళ్లగక్కింది. దీనితో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు. తమ జట్టు రానించనంత మాత్రాన ఇతరులపై బురదజల్లడం సరైనది కాదు. అది వ్యక్తిత్వాన్ని, క్రీడా స్ఫూర్తిని దెబ్బ తీస్తుంది అంటూ షెహర్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా షెహర్ తన వక్ర బుద్ది బయట పెట్టుకుంది. బాంగ్లాదేశ్ కనుక భారత్ ని ఓడిస్తే.. బంగ్లాదేశ్ కుర్రాడితో డేటింగ్ చేస్తా అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.