ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో అగ్రహీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థ చిరంజీవికి సంబంధించిన కొన్ని విషయాలను తమ కథనంలో పేర్కొంది. నటుడిగా, డాన్సర్ గా ముప్పై ఏళ్ల పాటు తీరిక లేకుండా గడిపిన మెగాస్టార్ కి నటనతో పాటు ఇష్టమైంది మరొకటి ఉందట. అదే ఫొటోగ్రఫీ.. చిన్నప్పటినుండి ఆయన ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉండేదట.

కానీ మధ్యతరగతి కుటుంబ నేపధ్య కారణంగా కెమెరాలను కొనుక్కునే స్థోమత లేకపోయేది. సినిమాల్లోకి వచ్చిన తరువాత పెరిగిన సంపాదనతో తనకు ఇష్టమైన కెమెరాలను కొనుక్కొని తన ఇంట్లో ఒక గదిని నింపేశాడనే విషయం అతడి సన్నిహితులకు మాత్రమే తెలిసిన నిజం. ఇక మెగాస్టార్ గా ఎందరికో స్ఫూర్తిగా నిలిచి భవిష్యత్తు తరాలను ప్రోత్సహించే చిరంజీవి చేతిరాత అర్ధంకాని విధంగా ఉంటుందట.

ఆయన రాసిన కాగితాన్ని కొంతకాలం తరువాత ఆయనకు చూపిస్తే ఆయనకు కూడా అర్ధంకాని విధంగా ఉంటుందని అతడి కుటుంబానికి, కొందరికి మాత్రమే తెలుసట. గతంలో ఓ సందర్భంలో తనకు నటనలో పద్మభూషణ్ వచ్చింది కానీ తన చేతిరాత మాత్రం ఇప్పటికీ మారలేదంటూ చిరు చెప్పాడు. చిరుకి పజిల్ గేమ్స్ తో పాటు చెస్ అంటే కూడా బాగా ఇష్టమట.

తీరిక దొరికినప్పుడల్లా తన భార్యతో కలిసి ఈ గేమ్స్ ఆడుతుంటాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు చిరుకి ఉన్న క్రేజ్ కి రూ.30 కోట్ల పారితోషికం అందుకున్నారు కానీ ఆయన మొదటి సినిమా 'పునాదిరాళ్లు' కోసం ఆయన అందుకున్న పారితోషికం 1,116 రూపాయలు మాత్రమే..     

ఇవి కూడా చదవండి.. 

సుబ్బిరామిరెడ్డితో చిరు భేటీ!

చిరంజీవి ఎపిక్ సినిమా చేస్తారనుకుంటే.. ఆయన మాత్రం: బన్నీ కామెంట్స్!