హీరోయిన్‌ కాజల్‌.. కళ్యాణం శుక్రవారం తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూతో జరిగిన విషయం తెలిసిందే. ఎంత పెళ్లి పనులతో బిజీగా ఉన్నా కాజల్‌.. తన అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రమ్‌ వేదికగా ఫొటోలను షేర్‌ చేసింది.  పంజాబీ అయిన కాజల్‌ను, కశ్మీరీ అయిన గౌతమ్‌ కిచ్లూ దంపతులను అభిమానులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నామని తెలుపుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అసలు వీరిద్దరూ ఎక్కడ కలిసారు. వీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమ ఎలా పెళ్లికి దారితీసిందనేది అభిమానుల్లో చర్చగా మారింది. ఈ విషయం గమనించిందేమో..పెళ్ళైన తర్వాత కాజల్ అగర్వాల్ ఆ విషయం బయటపెట్టింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో మూడు రోజుల క్రితం కాజల్ పెళ్లి అయినా..  పదేళ్లుగా గౌతమ్ తెలుసు అని చెప్తోంది.

కాజల్ మాట్లాడుతూ..“గౌతమ్ నాకు 10 ఏళ్ల పైగా పరిచయం. 7 ఏళ్లుగా మా మధ్య స్నేహం బలపడింది. ఇద్దరం రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నాం. అయితే,కరోనా లాక్ డౌన్ సమయంలో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నామని అర్దం చేసుకున్నాము. ఒకరినొకరు తరుచుగా చూసుకోపోవటం వల్ల కావచ్చు. అయితే  పెళ్లి చేసుకుందామని గౌతమ్ ముందుగా నాకు ప్రొపోజ్ చేశాడు. ఈ ఏడాది ప్రారంభం లో పెళ్లి చేసుకుందామని అడిగాడు. ఆ ప్రొపోజల్ కోసమే వెయిట్ చేస్తున్నా. చాలా ఆనందం వేసింది. ఆ తర్వాత లాక్డౌన్ కావడంతో పెళ్లి ఆలస్యం అయింది,” అని తన లవ్ స్టోరీ గురించి చెప్పింది. బెస్ట్ ఫ్రెండ్ లవర్ కావడం, అతనే నా భర్త కావడం అదృష్టం అని మురిసిపోతోంది 
 
మరో పోస్ట్‌లో.. ''పెళ్లి అనగానే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అందులోనూ ఈ మహమ్మారి టైమ్‌లో అది ఒక ఛాలెంజ్‌ లాంటిది. అయినా సరే.. మేము కోవిడ్‌ ప్రోటోకాల్‌ని ఖచ్చితంగా పాటించాము. అందుకే భారీగా జరగాల్సిన ఈ పెళ్లిని చాలా అంటే అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ముగించాము. వేడుకలో భాగమైన ప్రతి ఒక్కరికీ ముందుగానే అన్ని జాగ్రత్తలు తెలియజేశాము. మా పెళ్లికి హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ఎందరినో మిస్‌ అయ్యాము.. వారందరినీ త్వరలోనే కలుసుకుంటానని ఆశిస్తున్నాను.." అని కాజల్‌ పేర్కొంది.