తమిళ స్టార్ ధనుష్ (Dhanush) తాజాగా నటిస్తున్న చిత్రం ‘సార్’. ఇప్పటికే అందిన అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుండగా.. తాజాగా సెకండ్ సింగిల్ విడుదలై ఆకట్టుకుంటోంది.
తమిళ స్టార్ ధనుష్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తొలి చిత్రం `సార్` SiR. తెలుగుతో పాటు తమిళంలో బైలింగ్వుల్ గా తెరకెక్కుతోంది. తమిళంలో ‘వాతీ’ టైటిల్ తో విడుదల కానుంది. దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్ సంస్థలు కూడా నిర్మాణ భాగస్వామంగా ఉన్నాయి.
వచ్చే నెలలో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకోగా.. తాజాగా సెకండ్ సింగిల్ విడుదలైంది. జాతీయ అవార్డ్ గ్రహీత, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ఆకట్టుుకుంటోంది. మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు. గతంలో ఆయన రాసిన 'నేను సైతం', 'సారంగ దరియా' లాంటి అద్భుతమైన పాటలు ఇప్పటికీ గుర్తుండిపోగా.. ‘సార్’ చిత్రానికి మరో మధుర గీతం అందించారు.
తాజాగా విడుదలైన 'బంజారా' లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. అందులోని లోకేషన్లు పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. కథానాయకుడు ఊరిలో వాళ్ళతో కలిసి నాట్యం చేయడం, అలాగే హోటల్ లో స్నేహితులతో కలిసి తిని బయటకు వచ్చాక అక్కడున్న చిన్నారికి డబ్బు సాయం చేయడం వంటివి అతని పాత్ర తీరుని, స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. గీతం లోని సాహిత్యానికి అద్దం పట్టేలా కథానాయకుడి పాత్ర ఉంది.
"ఆడవుంది నీవే ఈడ ఉంది నీవే
నీది కానీ చోటే లేనేలేదు బంజారా
యాడ పుట్టె తీగ యాడ పుట్టె బూర
తోడు కూడినాక మీటిచూడు తంబూర"
అంటూ సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. "ఏదీ మన సొంతం కాదు. కష్టాలు, సుఖాలు శాశ్వతం కాదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే జీవితం" అనే లిరిక్స్ ఆలోజింపచేస్తున్నాయి. సుద్దాల అద్భుతమైన సాహిత్యానికి అంతే అద్భుతమైన జి వి ప్రకాష్ సంగీతం, అనురాగ్ కులకర్ణి స్వరం తోడై పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో 2023 ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ధనుష్ సరసన సంయుక్తా మీనన్ నటిస్తోంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు తదితరులు ఆయా పాత్రల్లో అలరించనున్నారు.
