సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్ జరిగింది. థమన్ నుండి రానున్న సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగిపోయింది. 

టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu)ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బాక్సాఫిస్ కింగ్ కి ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మూవీ విడుదలైతే చాలు రికార్డులు బద్దలు కావాల్సిందే. అలాంటి మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన సర్కారు వారి పాట పోస్ట్ ఫోన్ అయ్యింది. ఏకంగా మే 12కి వాయిదా పడింది. అయితే సర్కారు వారి పాట నుండి వస్తున్న అప్డేట్స్ మాత్రం కిక్ ఇస్తున్నాయి. 

సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ 'కళావతి' ఓ రేంజ్ లో పాప్యులర్ అయ్యింది. వంద మిలియన్ వ్యూస్ కి దగ్గరవుతున్న ఈ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కళావతి సాంగ్ మేనియా కొనసాగుతుండగానే సెకండ్ సింగిల్ రెడీ చేస్తున్నారు. సర్కారు వారి పాట మూవీ నుండి సెకండ్ సింగిల్ ఎప్పుడు రానుందో రేపు ప్రకటించనున్నారు. ఈ మేరకు యూనిట్ ప్రకటన చేశారు. రేపు సెకండ్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్లు అప్డేట్ ఇచ్చారు. 

Scroll to load tweet…

త్వరలో రానున్న పండుగ సందర్భంగా సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ విడుదల కానుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చినట్లు అయ్యింది. దర్శకుడు పరశురామ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.