యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహోపై దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి. యువ దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ రాని యాక్షన్ చిత్రంగా తెరక్కిస్తున్నాడు. ఆగష్టు 15న విడుదల కావాల్సిన సాహూ ఆగష్టు 30కి వాయిదా పడింది. 

చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మాత్రం చకచకా చేసుకుంటూ వెళుతోంది. సినిమా ఏస్థాయిలో ఉండబోతోందో టీజర్ ద్వారా శాంపిల్ చూపించారు. ఇక సైకో సైయాన్ సాంగ్ ఆకట్టుకుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రభాస్, శ్రద్దా కపూర్ మధ్య కెమిస్ట్రీ ఎంత ఘాటుగా ఉండబోతోందో తెలియజేస్తోంది. 

'ఏ చోట నువ్వున్నా' అనే సెకండ్ సాంగ్ ని మంగళవారం రోజు రిలీజ్ చేయనున్నారు. ఏ విషయాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో శ్రద్దాకపూర్ ప్రభాస్ ని కౌగలించుకుని ఉన్న ఫోజు రొమాంటిక్ గా ఉంది. శ్రద్దా కపూర్ రెడ్ డ్రెస్ లో అదరగొడుతుండగా, ప్రభాస్ వైట్ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.