పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వస్తుంది వకీల్ సాబ్.  పవన్ ని వెండితెరపై చూసి మూడేళ్లు దాటిపోయింది. ఆయన గత చిత్రం అజ్ఞాతవాసి 2018జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కావడం జరిగింది. పాలిటిక్స్ లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. 2019 చివర్లో పవన్ తన కమ్ బ్యాక్ ప్రకటించారు. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్నట్లు వెల్లడించారు. వకీల్ సాబ్ గత ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కావాల్సింది. అయితే లాక్ డౌన్ పరిస్థితులు సినిమా విడుదల ఆలస్యానికి కారణం అయ్యాయి. 


పవన్ లాయర్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల కానుంది. మార్చ్ 3న సాయంత్రం 5గంటలకు 'సత్యమేవ జయతే' లిరికల్ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 


గత ఏడాది మహిళా దినోత్సవం కానుకగా 'మగువా మగువా..' సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. సిధ్ శ్రీరామ్ పాడిన మగువా సాంగ్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ అందుకుంది. కాగా వకీల్ సాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది.