Asianet News TeluguAsianet News Telugu

Suma : ‘జయమ్మ పంచాయతీ’ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన ‘ఎస్ఎస్ రాజమౌళి’

తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయతీ’ మూవీతో త్వరలో బిగ్ స్క్రీన్ మీద కనిపించనున్నారు. తెలుగు టెలివిజన్ ను ఒంటి చేత్తో ఏలుతున్న ఈ జయమ్మ  ఇన్నాళ్లు తన మాటలతో అందరినీ కట్టి పడేంది. ఇక తన అభినయంతో అభిమానులను మెప్పించనుంది.
 

Second Lyrical Song Released From Jayamma Panchayati.. SS Rajamouli Released It.E
Author
Hyderabad, First Published Jan 16, 2022, 4:24 PM IST

యాంకర్ సుమ తన స్పాంటన్యుటితో అంచెలంచెలుగా ఎదిగింది. తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది. కొత్త గా ఏ షో స్టార్టైయినా ముందుగా తన పేరును పరిశీలించిగానే ప్రారంభించరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ కార్య క్రమాలు, గేమ్ షోలకు పరిమితమైన సుమ ఉన్నట్టుండి కొత్త అవతారం ఎత్తారు.

తన మాటలతో మెప్పించిన సుమ. తనలో నటనా సామార్థ్యాన్ని చూపించనున్నారు. అందుకు అనుగుణంగానే సినిమాల్లో లీడ్ రోడ్ లో నటించడం ప్రాంభించారు సుమ కనకాల. ప్రధాన పాత్రధారురాలుగా సుమ నటిస్తుండగా తనతో పాటు తదితర సీనియర్ యాక్టర్లు మూవీలో పలు రోల్స్ లో కనిపించనున్నారు. 

ఈ చిత్రాన్ని బలప్రకాష్ నిర్మాతగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. కాగా విజయ్ కుమార్ కలివరపు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి మంచి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి సాంగ్ రిలీజ్ కాగా, తాగా రోండో లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడదుల చేసింది. 

ఈ లిరికల్ సాంగ్ ను  ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కాగా ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్రి సరికొత్త లిరిక్స్ ను అందించారు. ప్రస్తుతం ఈ రెండో లిరికల్ సాంగ్ య్యూటూబ్ లో దూసుకుపోతోంది. అప్పటికే హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుమ అభిమానులు సాంగ్ ను  ఎంజాయ్ చేస్తున్నారు. 

ఈ సాంగ్ లో సుమ పాత్రకు తగ్గట్టుగా తన అభినయాన్ని చూపించింది. మూవీకి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి లిరికల్ సాంగ్ లో దర్శనమివ్వడం కొంత స్పెషల్  అట్రాక్షన్ గా నిలిచింది. దీనికి తోడు లిరిక్స్ వినడానికి చాలా ఈజీగా ఉండటం, దానికి క్యాచీ మ్యూజిక్ తోడవటంతో సాంగ్ చక్కగా కుదిరింది. 

 

అయితే  ఈ సాంగ్ ను రిలీజ్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలలో ఫన్నీ ట్వీట్ చేశారు. సాంగ్ లింక్ ను యాడ్ చేసి ‘జయమ్మ చూసే కళ్లకి సూర్యకాంతమ్మ!’ అంటూ సాంగ్ లో తనకు నచ్చిన ఓ లిరిక్ ను రాశాడు. ఆ ట్వీట్ ను సుమ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. 

కాగా జయమ్మ పంచాయతీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ‘నాచురల్ స్టార్ నాని’(Nani) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే జయమ్మ పంచాయతీ పేరుతో సెలబ్రెటిలతో సుమ తన సినిమాను ఆసక్తికరంగా ప్రమోట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 16కు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం సుమ అభిమానులు ఎదురు చూస్తున్నారు.    
 

Follow Us:
Download App:
  • android
  • ios