తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్ని దశాబ్దాలు దాటినా సత్యభామ అనగానే మనసులో జామున గారి రూపమే దర్శనమిస్తుంది. సినిమా ఏదైనా పాత్ర ఎలాంటిదైనా చక్కని హావభావాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి జామున. రీసెంట్ గా ఆమె తన జ్ఞాపకల గురించి వివరించారు. 

అయితే అందులో నమ్మకాలపై కూడా జమున తనదైన శైలిలో తెలియజేశారు."నాకు దైవభక్తి, నమ్మకాలు లేవు అని చెప్పను.  కానీ దెయ్యాలు ఉన్నాయని పూజలు చేయడం వంటి విషయాలను అస్సలు నమ్మను. అప్పట్లో మా ఇంట్లో వారు కాస్త కంగారు పడి దిష్టి తీసేవారు. గణేశుడిని పూజించి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయని అంటారు. సరదాగా ఎలాంటివి వస్తాయో అని చంద్రుడిని చూస్తా..  

నమ్మకాలు ఉన్నాయి. కానీ దెయ్యాలు ఉన్నాయంటే నమ్మను. షూటింగ్ సమయాల్లో రాత్రి 10 అయినా ఒక్కదాన్నే ఇంటికి వెళ్ళేదాన్ని. ఇక మా అమ్మమ్మ ఎంత అలస్యమయినా దిష్టి తీయకుండా ఇంట్లోకి రానిచ్చేవారు కాదు" అని జమున వివరించారు.