కొద్దిరోజుల క్రితం మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించింది సాయేషా-ఆర్యల జంట. చెప్పినట్లుగానే ఇప్పుడు వీరి వివాహ తంతు మొదలైంది. హైదరాబాద్ వీరి పెళ్లి వేడుకకు వేదిక కానుంది.

ఓ విల్లాలో ఆర్య-సాయేషా ల వివాహ వేడుక మొదలైంది. శనివారం రాత్రి వీరి వివాహానికి సంబంధించి సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులతో పాటు నటుడు సంజయ్ దత్ కూడా హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి.

సంగీత్ లో సాయేషా డాన్స్ చేస్తోన్న వీడియోలు కూడా బయటకి వచ్చాయి. మరి కాసేపట్లో సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఈరోజు జరగబోతున్న వివాహ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మీడియాకి చాలా దూరంగా ఈ పెళ్లి వేడుక జరగబోతుంది. సంజయ్ దత్, అజయ్ దేవగన్ లను మినహాయిస్తే కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి పెళ్లి జరగనుంది. పెళ్లి తరువాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.