అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు.

సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే  ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సుభద్ర పరిణయం అనే కామెడీ టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

'కృష్ణా.. బలరాముడు అంటే రాముడికి చుట్టమా' అని కమెడియన్ ప్రవీణ్ కృష్ణ పాత్రలో ఉన్న వెన్నెల కిషోర్ ని అడగడం.. దానికి వెన్నెల కిషోర్ ఇచ్చే సమాధానం, అలానే నాగచైతన్య పలికిన డైలాగులతో ఈ టీజర్ కామెడీతో నిండిపోయింది.

అర్జునుడిగా నాగచైతన్య కనిపించగా.. ఇతర పౌరాణిక పాత్రల్లో హైపర్ ఆది, సుదర్శన్, విధ్యులేక రామన్, వైవా హర్షలు కనిపించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కీరవాణి స్వరకర్త.