మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు బడా సినిమాలే వచ్చాయి. 100కోట్ల బిజినెస్ లు చేస్తూ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు నాగ చైతన్య లాంటి మీడియం మార్కెట్ ఉన్న హీరోతో 33 కోట్ల వరకు ఖర్చు చేసి సవ్యసాచి అనే సినిమాను విడుదల చేయడానికి సిద్ధమైంది. 

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ చుస్తే నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు ప్రమోషన్స్ తో పాటు అన్ని కలుపుకొని 33కోట్లు ఖర్చు చేయగా అందులో దాదాపు 24కోట్ల వరకు రికవర్ అయ్యినట్లు సమాచారం. 

ఎందుకంటే సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే నాన్ థియేటర్స్ హక్కుల కింద 12 కోట్లు వచ్చేశాయి. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ 4కోట్లకు అమ్ముడుపోగా అమెజాన్ ప్రైమ్ నుంచి 4 కోట్లు అందాయి. అదే విధంగా డబ్బింగ్, ఇతర దారుల్లో సినిమాకు మరో నాలుగు కోట్లు అందినట్లు టాక్. 

మొత్తంగా నాగ చైతన్య సినిమాకు ఎన్నడూ లేని విధంగా రిలీజ్ కు ముందే పెట్టుబడి డబ్బు దాదాపు వచ్చేసింది. మరి ఈ సినిమా అభిమానులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.