సత్యదేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ నేడు విడుదల చేశారు. సత్యదేవ్ నెవర్ బిఫోర్ అవతార్ లో అలరించారు. 

కృష్ణమ్మ టీజర్(Krishnamma Teaser) ఆకట్టుకుంది. నిమిషానికి పైగా ఉన్న టీజర్ ఆద్యంతం సీరియస్ నోట్ లో సాగింది. ముగ్గురు అనాథ మిత్రుల కథగా కృష్ణమ్మ తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి పుట్టారో తెలియని ముగ్గురు మిత్రుల ప్రశాంత జీవితాన్ని ఎవరో డిస్ట్రబ్ చేస్తారు. అక్కడి నుండి వాళ్ళ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సవాళ్లు. వాళ్ళను టార్గెట్ చేసింది ఎవరు? ఆ సమస్యల నుండి ముగ్గురు మిత్రులు ఎలా బయటపడ్డారు అనేదే కృష్ణమ్మ మూవీ కథగా చెప్పవచ్చు. 

సత్యదేవ్(Satya Dev) డీగ్లామర్ లుక్ ఆకట్టుకుంది. ఆయన గతంలో ఎన్నడూ చేయని సరికొత్త రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా కృష్ణమ్మ టీజర్ అంచనాలు పెంచేసింది. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించాడు. వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. కాల భైరవ సంగీతం అందించారు. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. 

Scroll to load tweet…

ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా సత్యదేవ్ చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయన గత చిత్రం గాడ్సే నిరాశపరిచింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సత్యదేవ్ నటనకు మాత్రం మార్కులు పడ్డాయి. ఈ మధ్య కాలంలో సత్యదేవ్ హీరోగా విడుదలైన తిమ్మరుసు, స్కైల్యాబ్ చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. ప్రస్తుతం ఆయన హీరోగా గుర్తుందా శీతాకాలం తెరకెక్కుతుంది. ఈ మూవీ తమన్నా హీరోయిన్. చిరంజీవి గాడ్ ఫాదర్, బాలీవుడ్ మూవీ రామ్ సేతు చిత్రాల్లో సత్యదేవ్ కీలక రోల్స్ చేస్తున్నారు.