‘బ్లఫ్‌ మాస్టర్‌’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి  డిపరెంట్ చిత్రాలు,క్యారక్టర్స్ తో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్‌. లాక్ డౌన్ సమయంలో బిజీగా ఉన్న హీరో ఎవరూ అంటే ఈయన పేరే చెప్పాలి. వరసపెట్టి ఓటీటిల్లో రిలీజ్ లు అయిన ఘనత కూడా ఈయనదే. ఈయన హీరోగా తాజాగా ‘తిమ్మరుసు’ అనే సినిమా రూపొందుతోంది. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్‌ . శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత మహేశ్‌ కోనేరుతో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవటం అప్పుడే దాదాపు ఫినిషింగ్ స్టేజికి రావటం కూడా జరిగింది. 

 అంతేకాదు ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ మొదలెట్టేసారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని డిసెంబర్ 9న వదులుతున్నారు. అలాగే ఈ సినిమాని జనవరి నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సినిమాని ఓటీటిలో రిలీజ్ చేస్తారా లేదా థియోటర్స్ లో వదులుతారా అనేది క్లారిటి లేదు. ఏ హీరో సినిమా కూడా ఈ మధ్యకాలంలో ఇంత రికార్డ్ స్దాయిలో షూటింగ్ కు వెళ్లి ఫినిష్ అయ్యి..రిలీజ్ కు రావటం జరగలేదు. ఈ విషయంలో సత్యదేవ్ దే రికార్డ్ అని చెప్పాలి. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ ఇది. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుంది.  నిరవధికంగా జరిగే లాంగ్‌ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్‌  చేశాం’’ అన్నారు. .  ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా,  వచ్చే నెల‌లో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.