శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో చిత్ర బృందం శనివారం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో హీరో సత్యదేవ్ ఎమోషనల్ అయ్యారు.
హీరో సత్యదేవ్ ఎమోషనల్ అయ్యారు. తన సినిమాని థియేటర్లో చూసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సత్యదేవ్ హీరోగా నటించిన `తిమ్మరుసు` చిత్రం శుక్రవారం థియేటర్లో విడుదలైంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు ఓపెన్ అయ్యాక విడుదలైన తొలి చిత్రంగా చెప్పొచ్చు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటించింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో చిత్ర బృందం శనివారం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో హీరో సత్యదేవ్ ఎమోషనల్ అయ్యారు.
తను హీరోగా నటించిన సినిమాకి తొలి సారి సక్సెస్ మీట్ చేసుకుంటున్నామని, చాలా ఉద్వేగంగా ఉందన్నారు. `బ్లఫ్‌మాస్టర్` సినిమా తర్వాత నా సినిమా థియేటర్లో మంచి రిలీజ్ అయ్యిందని, తనకిది ఒక డ్రీమ్‌లా ఉందన్నారు. థియేటర్లో ఆడియెన్స్ తో సినిమా చూస్తుంటే వారి ఈలలు, గోలలు వింటుంటే ఆనందంగా ఉంది. తాము అనుకున్న సన్నివేశాలు థియేటర్లో పేలుతుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. హీరోగా నటించిన సినిమా హిట్ ఇలా సక్సెస్ మీట్ జరుపుకోవడం ఫస్ట్ టైమ్ అని, ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. దర్శకుడు, నిర్మాత మహేష్ కోనేరు ఇలా టీమ్ అందరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత మహేష్ కోనేరు టీమ్‌కి, ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. తమ బ్యానర్‌పై వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ, కరోనా సమయంలో మా సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం మాకు ఇది `బాహుబలి`లాంటి సక్సెస్ అని తెలిపారు. కొత్త వారిని ఎంకరేజ్ చేయాలని, మంచి మాటలు చెప్పి సినిమాని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈసందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి, పటాసులు కాల్చి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు.
