Asianet News TeluguAsianet News Telugu

`సత్యభామ` ట్రైలర్‌.. కాజల్‌ 2.0 ని చూశారా?.. మైండ్‌ బ్లోయింగ్‌..

కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `సత్యభామ`  ట్రైలర్‌ వచ్చింది. ఇందులో కాజల్‌ తనలోని మరో యాంగిల్‌ని చూపించింది. ట్రైలర్‌లో రచ్చ చేసింది. 
 

Satyabhama trailer out kajal next level show arj
Author
First Published May 24, 2024, 9:04 PM IST

తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత  రూట్‌ మార్చింది. డిఫరెంట్‌ మూవీస్‌తో కమ్‌ బ్యాక్‌ అయ్యింది. ఆ మధ్య బాలయ్యతో కలిసి నటించింది కాజల్‌. ఇప్పుడు తొలిసారి లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. `సత్యభామ` పేరుతో ఈ మహిళా ప్రధానమైన మూవీ తెరకెక్కుతుంది. దర్శకుడు శశి కిరణ్‌ తిక్క కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఈ మూవీ రూపొందుతుండటం విశేషం. తాజాగా  ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సాయంత్రం  ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో `సత్యభామ` ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. గెస్ట్ గా వచ్చిన బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ రిలీజ్‌ కావడం విశేషం. 

ఇక మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో కాజల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. ఓ మర్డర్‌ కేసు విషయంలో ఆమె చేసిన పొరపాటు కారణంగా జాబ్‌ కోల్పోవల్సి వస్తుంది. జాబ్‌ పోయినా తన దగ్గర ఆ పవర్‌ ఉంది, దోషి ఎవరో కనిపెట్టే సత్తా ఉందని పోలీస్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ రాజ్‌ ఇచ్చిన ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ తో రంగంలోకి దిగిన కాజల్‌ నేరస్థులను పట్టుకునేందుకు తనలోని మరో యాంగిల్‌ని చూపించడం విశేషం. యాక్షన్‌లో నెక్ట్స్ లెవల్‌ షో చూపించింది కాజల్‌. ఓ రకంగా కాజల్‌ 2.0 వెర్షన్‌ ఆవిష్కరించింది. 

పోలీస్‌ పాత్రలో కాజల్‌ చాలా కొత్తగా ఉంది. అందమైన పోలీస్‌ ఆఫీసర్‌గా రచ్చ చేసింది. అదే సమయంలో యాక్షన్‌తోనూ మెస్మరైజ్‌ చేసిందీ భామ. చూడబోతుంటే యాక్షన్‌ సీన్ల కోసం కాజల్‌ బాగా కష్టపడిందని అర్థమవుతుంది. ఆ కష్టం వెండితెరపై కనిపిస్తుంది. ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. హిట్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. బీజిఎం సైతం ఆకట్టుకునేలా ఉంది.  ఈ మూవీకి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ తిక్కా, శ్రీనివాస రావు తక్కలపల్లి నిర్మించారు. ఈ నెల 31న విడుదల కావాల్సిన  ఈ మూవీని  వారం పాటు వాయిదా వేశారు. జూన్‌ 7న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెలాఖరులో ఎక్కువ సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. 

కాజల్‌  నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని మ్యారేజ్‌ చేసుకుంది. వీరికి కుమారుడు నీల్‌ కిచ్లు జన్మించారు. తల్లి అయిన తర్వాత కూడా కాజల్‌ `సత్యభామ` సినిమాలో యాక్షన్‌ సీన్లు చేయడం విశేషం.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios