Asianet News TeluguAsianet News Telugu

'వివాహ భోజనంబు' టీజర్:చూస్తే నవ్వకుండా ఉండలేరు

సత్య  హీరోగా 'వివాహ భోజనంబు' టైటిల్ తో సినిమా మొదలైపూర్తైంది.  రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు. ఈ సినిమా టీజర్ ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. టీజర్ చూస్తూంటే కరోనా నేపథ్యంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథతో రూపొందిన ఎంటర్టైన్మెంట్ చిత్రమిది అని అర్థమవుతోంది. ఆ టీజర్ మీరు ఇక్కడ చూడండి.
 

Satya Vivaha Bhojanambu  Teaser jsp
Author
Hyderabad, First Published Dec 18, 2020, 5:32 PM IST

తెలుగులో కమిడియన్స్ ఒక్కొక్కరే ప్రమోషన్ తీసుకుని హీరోలు అవుతున్నారు. ఇప్పుడు హాస్య నటుడు సత్య వంతు వచ్చింది. సత్య ఈ మధ్యకాలంలో వరసగా అన్ని సినిమాల్లో దాదాపు నవ్విస్తున్నారు. దాంతో సత్యని హీరోగా పెట్టి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అంతే సత్య  హీరోగా 'వివాహ భోజనంబు' టైటిల్ తో సినిమా మొదలైపూర్తైంది.  రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు. ఈ సినిమా టీజర్ ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. టీజర్ చూస్తూంటే కరోనా నేపథ్యంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథతో రూపొందిన ఎంటర్టైన్మెంట్ చిత్రమిది అని అర్థమవుతోంది. ఆ టీజర్ మీరు ఇక్కడ చూడండి.

 కథ విషయానికి వస్తే... పది రూపాయలు పార్కింగ్ టికెట్ కొనడానికి, స్నేహితులకు పుట్టినరోజు పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి మహేష్ (సత్య). కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. కానీ, ఆ తరవాత అసలు కథ మొదలవుతుంది. లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ తన ఇంట్లో ఉండిపోయిన పెళ్లివాళ్లకు రోజు వారి భోజనాలు పెట్టాల్సి వస్తుంది. మామగారిని మెప్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఫన్ తో నడిపించారని అర్దమవుతోంది.  సందీప్ కిషన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ,హీరోగా సత్య అద్భుతంగా నటించాడనీ యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రంలో నటీనటులు:
సత్య, అర్జావీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టి.ఎన్.ఆర్, 'వైవా' హర్ష, శివోన్ నారాయణ, మధుమని, నిత్యా శ్రీ, కిరీటి, దయ, కల్పలత & ప్రత్యేక పాత్రలో యువ హీరో సందీప్ కిషన్. 

సాంకేతిక నిపుణుల వివరాలు:
పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), పాటలు: కిట్టు, కృష్ణ చైతన్య, నృత్యాలు: సతీష్, విజయ్, మాటలు: నందు ఆర్.కె, కథ: భాను భోగవరపు, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: చోటా కె. ప్రసాద్, ఛాయాగ్రహణం: మణికందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సీతారామ్, శివ చెర్రీ, సంగీతం: అనిరుద్ విజయ్ (అనివీ), సమర్పణ: ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, నిర్మాతలు: కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.  నిర్మాణ సంస్థలు  ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ చిత్రాన్ని నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios