టాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా  జంటగా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మూవీ నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. రొమాంటిక్ యాంగిల్ లో సత్యదేవ్ అదరగొట్టాడు. 

విభిన్న కథలతో, తన నటనతో ఆడియెన్స్ కు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satya Dev). ఇన్నాళ్లు సీరియస్ పాత్రల్లో నటించిన దుమ్ములేపిన యంగ్ హీరో.. తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’తో సరికొత్త సత్యదేవ్ ను చూపించాడు. రొమాంటిక్ యాంగిల్ లో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా బ్యూటీఫుల్ థియేట్రికల్ ట్రైలర్ ను వదిలారు. గతంలో విడుదల చేసిన ట్రైలర్ తోనే ఆకట్టుకోగా.. తాజాగా మరింతగా సినిమాపై ఆసక్తిని పెంచారు. 

Gurtunda Seetakalam థియేట్రికల్ ట్రైలర్ బ్యూటీఫుల్ గా ఉంది. ముగ్గురు హీరోయిన్లతో సత్యదేవ్ లవ్ స్టోరీస్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మిల్క్ బ్యూటీ తమన్నాతో సత్య దేవ్ రొమాన్స్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. కన్నడ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్ టైల్’కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ మూడు ప్రేమకథలను రొమాంటిక్ గా వివరించబోతున్నారు. ముగ్గురితో సత్యదేవ్ ఎందుకు ప్రేమలో పడతాడు.. చివరికి ఎవరితో ఉండిపోతాడు.. ఈ మూడు ప్రేమకథలకు శీతాకాలానికి సంబంధం ఏంటనే అంశాలపై ‘థియేట్రికల్ ట్రైలర్’ ద్వారా మరింతగా ఆసక్తి పెంచారు.

డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్, నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్పిస్తున్నారు. కెరీర్ లో మొదటిసారి సత్యదేవ్ రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నారు. తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు నాగ శేఖర్ దర్వకత్వం వహించారు. కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు సత్యదేవ్ ‘తిమ్మరుసు’,‘క్రిష్ణమ్మ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

Scroll to load tweet…