ఆశ, అత్యాశ‌ల నేపథ్యంలో రూపొందిన త‌మిళ మూవీ`చ‌తురంగ వేట్టై` . తమిళంలో ఘన విజయం సాదించిన ఈ చిత్రాన్ని తెలుగులో బ్లఫ్ మాస్టర్ పేరుతో అభిషేక్ ఫిలిమ్స్ రీమేక్ చేసి రిలీజ్ చేస్తోంది..గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి ఈ మూవీకి దర్శకుడు . `జ్యోతిల‌క్ష్మి`, `ఘాజి` చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు . 

`ఎక్క‌డికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో హీరోయిన్.  సునీల్ కాశ్య‌ప్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రం ట్రైల‌ర్ ను రీసెంట్ గా  యూనిట్ విడుద‌ల చేసింది.. ఇంట్రస్ట్ గా ఉన్న  ఈ మూవీ ట్రైల‌ర్ ను మీరూ చూడండి.

గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి... ఇవి పంచభూతాలు.. ఈ ఐదు పంచభూతాలను శాసించే స్థాయికి ఎదిగిన ఆరో పంచభూతం డబ్బు.  డబ్బు తనపై వచ్చిన అభియోగాలను చెరిపేసుకునే డస్టర్ లా పనిచేస్తుంది వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. కోడిపై జాలి చూపిస్తే.. చికెన్ 65 ఎలా తింటావ్ అని చెప్పే డైలాగుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  

డబ్బు సంపాదించడమే ప్రధానాంశంగా పెట్టుకున్న ఓ  యువకుడి కథే బ్లఫ్ మాస్టర్.  డబ్బు సంపాదించడం కోసం ప్రజలను రకరకాలుగా మోసాలు చేస్తుంటాడు.  తులం బంగారం సగం ధరకే ఇస్తామని చెప్తే... జనాలు బారులు తీరి నిలబడటం వెనుక ప్రజలను ఈజీగా ఎలా మోసం చెయ్యొచ్చో చూపించాడు.  డబ్బు సంపాదించాలంటే హత్యలు దోపిడీలు చెయ్యక్కర్లేదు.. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించవచ్చు అని చెప్పడం ద్వారా ఆ క్యారక్టరైజేషన్ ఈ ట్రైలర్ లో చెప్పేసారు.

ఆదిత్యామీన‌న్‌, పృథ్వి, బ్ర‌హ్మాజీ, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, శ్రీరామరెడ్డి , వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, `దిల్‌` ర‌మేష్‌ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రానికి క‌థ‌: హెచ్‌.డి.వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్: పుల‌గం చిన్నారాయ‌ణ‌ ,సంగీతం: సునీల్ కాశ్య‌ప్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్: బ్ర‌హ్మ క‌డ‌లి, కెమెరా: దాశరథి శివేంద్ర‌ , కో డైర‌క్ట‌ర్‌: కృష్ణ‌కిశోర్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్స్: ఆర్‌.సెంథిల్‌, కృష్ణ‌కుమార్‌,నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై, మాటలు -ద‌ర్శ‌క‌త్వం: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి