విలక్షణ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్న సత్యరాజ్‌ తనయుడు శిబిరాజ్‌ హీరోగా రాణిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన `మాయోన్‌` చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు టీజర్‌ని హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు రానా. 

తెలుగు తెరపైనే కాదు.. దేశ వ్యాప్తంగా `కట్టప్ప`గా పాపులర్‌ అయ్యారు సత్యరాజ్‌. `బాహుబలి`లో ఆయన నటించిన కట్టప్ప పాత్ర గురించి, ఆయన బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం గురించే.. ఆ సినిమా కంటే ఎక్కువగా చర్చ జరిగింది. విలక్షణ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్న సత్యరాజ్‌ తనయుడు శిబిరాజ్‌ హీరోగా రాణిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన `మాయోన్‌` చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు టీజర్‌ని హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు రానా. 

కిశోర్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రమిది. గ్రాఫిక్స్ మాయా జాలంతో అద్భుతమైన విజువల్స్ తో భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోంది. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న `మాయోన్‌` షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆద్యంతం ఫాంటసీ ఎలిమెంట్స్ తో సాగే ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది. విజువల్‌ వండర్‌గా ఉండబోతుందనిపిస్తుంది. టీజర్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది.

ఐదువేల ఏళ్ళనాటి ఓ దేవాలయ మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ థ్రిల్లర్ మూవీ రూపొందినట్టు టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం హైలైట్ కాబోతోంది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అరుణ్ మొళి మాణిక్యం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్‌ కాబోతుండటంతో మరింత ఆసక్తినెలకొంది.

also read:కుక్కల గురించి ట్వీట్ చేశా... సమంత గురించి కాదు, బాధపడితే నేనేం చేయలేను: సిద్ధార్థ్ వ్యాఖ్యలు