టీవీ యాడ్స్ చూసేవాళ్ళకు బాగా పరిచయమున్న మొహం సాషా చెట్రిది. పేరు చెప్పగానే గుర్తుపట్టలేకపోవచ్చు కాని ఎయిర్ టెల్ కంపెనీ మొబైల్ నెట్వర్క్ ఛాలెంజ్ యాడ్ లో 4జి గురించి పదే పదే ఊదరగొట్టి పొట్టి జుట్టుతో కనిపించిన అమ్మాయి అంటే మాత్రం వెంటనే మైండ్ లో ఫ్లాష్ అయిపోతుంది. లుక్స్ లోనే కాకుండా చక్కని స్మైల్ తో యాక్టింగ్ తో ఆ యాడ్ రక్తి కట్టేలా బాగా నటించి సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ పాప సినిమాల వైపు అడుగులు వేస్తోంది. అది కూడా తన మొదటి సినిమా తెలుగు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కేరింత అనే యూత్ ఫుల్ మూవీ తీసిన సాయి కిరణ్ అడవి దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఆడిషన్ కు వచ్చిన సాషా తన స్కిల్స్ తో దర్శకుడితో పాటు నిర్మాతను కూడా మెప్పించిందట. హీరో తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సాషా చెట్రి నార్త్  ఇండియన్. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన సాషా ఉన్నత విద్యాభ్యాసం ముంబైలో జరిగింది. ఎయిర్ టెల్ యాడ్ చేయడానికి మందు కాపీ రైటర్ గా పని చేసిన సాషా ఆ యాడ్ తెచ్చిన పాపులారిటీతో కొత్త కెరీర్ వైపు దారులు వేసుకుంది . ఒక అక్కయ్య ఉన్న సాషా తల్లితండ్రులకు ఇద్దరే కూతుళ్ళు. బాగా విసిగించిన యాడ్ గా సాషా చేసిన ఎయిర్ టెల్ 4G యాడ్ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. అందులో తన తప్పు లేదు కాబట్టి అందరు కంపెనీనే నిందించారు. కేవలం ఇందులో నటించడం కోసమే తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని బాబ్డ్ హెయిర్ లోకి మారింది సాషా. కట్టి బట్టి అనే సినిమాలో చిన్న పాత్ర వేసిన సాషా పూర్తి స్థాయి హీరొయిన్ గా చేసే మొదటి సినిమా తెలుగుదే కావొచ్చు. ఇక్కడ క్లిక్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా. సాషా చెట్రి అలాంటి ఆశలతోనే ఇక్కడ అడుగు పెట్టబోతోంది.