బాలీవుడ్‌ సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలకు కొరియోగ్రాఫీ అందించిన సరోజ్‌ ఖాణ్ మరణం ఇండస్ట్రీ వర్గాల్లో విషాదాన్ని నిపింది. జూన్‌ 20 తీవ్రమైన చాతీ నొప్పి రావటంతో సరోజ్‌ ఖాన్‌ను గురు నానక్‌ హాస్పిటల్‌లో చేర్పించారు.

బాలీవుడ్‌ సినీ పరిశ్రమ అంతా మాస్టర్‌జీ అని ప్రేమగా పిలుచుకునే సరోజ్‌ ఖాన్‌ మథర్ ఆఫ్‌ కొరియోగ్రఫి గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 4 దశాబ్దాల పాటు 200లకు పైగా సినిమాలకు ఆమె నతృ దర్శకత్వం అందించారు. అయితే తన చివరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ను జూన్‌ 14న అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఆ రోజు మరణించిన సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ గురించి ఆమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సుశాంత్ సింగ్‌తో ఎప్పుడు వర్క్ చేయకపోయినా తను ఉన్నత స్థాయికి ఎదగాలని తను ఆకాంక్షించినట్టుగా ఆమె తెలిపారు. సరోజ్‌ ఖాన్‌  మరణం తరువాత ఆమె చేసిన చివరి సోషల్ మీడియా పోస్ట్ మరోసారి వైరల్‌గా మారింది.

కొరియోగ్రాఫరంగా సరోజ్‌ ఖాన్‌ ఆఖరి చిత్రం 2019లో రిలీజ్‌ కలంక్‌. కరణ్ జోహర్‌ నిర్మించిన ఈ సినిమాలో తభా హో గయే పాటకు ఆమె నృత్య రీతులు సమకూర్చారు. ఈ పాటలో మాధురీ దీక్షిత్‌ నటించింది.