సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి చిత్రంగా సర్కారు వారి పాట చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పరుశురామ్ మహేష్ కోసం ఓ భిన్నమైన సబ్జెక్టు ని ఎంచుకోవడంతో పాటు ఆయన ఇమేజ్ తగ్గట్టుగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అందుకే వంశీ పైడిపల్లిని కూడా కాదని మహేష్ పరుశురామ్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. 

సర్కారు వారి పాట బ్యాంకింగ్ ఫ్రాడ్స్ పై తెరకెక్కుతున్న సెటైరికల్ మూవీ అని సమాచారం. మహేష్ లుక్ అండ్ మేనరిజం సరికొత్తగా ఉంటాయట. మహేష్ ఆటిట్యూడ్ మూవీకి హైలెట్ అని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన మహేష్ ప్రీ లుక్ ఫ్యాన్స్ ని  బాగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ తీసుకున్న సంగతి తెలిసిందే. 

దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. కీర్తి సురేష్ పుట్టిన రోజు పురస్కరించుకొని సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఆమెకు వెల్కమ్ చెప్పారు.  మహేష్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుండగా కాంబినేషన్ పై విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఇక కొద్దిరోజులలో సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. అమెరికాలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.