కంగారేం లేదు, చాలా టైమ్ ఉంది

కరోనా తీవ్రత తగ్గిందని ఆ మధ్యన  సర్కారు వారి పాట సినిమాని  మొదలు పెట్టినా మళ్లీ  కరోనా మహమ్మారి విజృంభణతో  మళ్లీ బ్రేక్ లు పడతాయనే భయంలో ఉందిట టీమ్. దాంతో  మహేష్ బాబు. కరోనా తీవ్రత తగ్గాకే షూటింగ్ అని చెబుతున్నాడట. అలాగే మనకు చాలా టైమ్ ఉంది. వచ్చే సంక్రాంతికి కదా రిలీజ్ అని ధైర్యం చెప్తున్నట్లు సమాచారం.

Sarkaru Vaari Paata Team Not in A Hurry jsp

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం సర్కారువారి పాట ఆ మధ్యన దుబాయిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది. ఆ తర్వాత షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేసారు. కానీ వీసా సమస్యలతో ఆగిపోయారు. ఆ తర్వాత అమెరికా షెడ్యూల్ ని గోవాలో చేద్దామనుకున్నారు. అయితే అక్కడికి వద్దనుకున్నారట. దాంతో మొత్తం ఇప్పుడు  ప్లాన్స్ అన్నీ రీషెడ్యూల్ చేస్తున్నారు. ఇక్కడే హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో త్వరలో ఇక్కడ షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత పరిస్దితిని బట్టి గోవా షెడ్యూల్ ప్లాన్ చేస్తారట. సంక్రాంతి 2022కు రిలీజ్ పెట్టుకోవటంతో చాలా టైమ్ ఉంది. కంగారేం లేదు. రిస్క్ తీసుకోవద్దు..కరోనా కంట్రోలులోకి వచ్చేదాకా జాగ్రత్తగా ఇక్కడిక్కడే ప్లాన్ చేద్దామని మహేష్ చెప్పేసారట డైరక్టర్ తో. దాంతో పరుశరామ్ సైతం ఇదే నిర్ణయానికి వచ్చారని వచ్చి, అన్ని జాగ్రత్తలతో ఎక్కడ షూట్ చేయగలమో చూసుకుంటున్నారని తెలుస్తోంది.  

వాస్తవానికి  సర్కారు వారి పాట షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అమెరికా పరిసర ప్రాంతాల్లో జరాపాలనే యోచనలో ముందుగా అమెరికా షెడ్యూ ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. డిసెంబర్ నెలాఖరున చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ చిత్ర టీమ్ కి వీసా ప్రోబ్లెంస్ తో ఒకసారి అమెరికా షెడ్యూల్ వాయిదా పడింది.  

మధ్యలో కరోనా వచ్చి ఒక్కసారిగా ప్లాన్ చేంజ్ చెయ్యగా… ఇప్పుడు మరోసారి సర్కారు వారి పాట షెడ్యూల్ లో మార్పులు జరుగుతున్నాయని సమాచారం.  సర్కారు వారి విషయంలో చిత్ర యూనిట్ మరోసారి మార్పులు చేయక తప్పడం లేదు. అమెరికా షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేసుకుని ముందుగా ఇక్కడ హైద్రాబాద్ లోనే  సర్కారు వారి పాట షూట్ ప్లాన్ చేసుకున్నాడట. ఇక్కడ హైదరాబాద్ లోనే సర్కారు వారి పాట కోసం పరశురామ్ అనుకున్న సెట్స్ లో షూటింగ్ మొదలు పెట్టి.. తర్వాత అక్కడ అమెరికాలో పరిస్థితులు అనుకూలించాక అక్కడి షెడ్యూల్ చేసుకోవచ్చని డిసైడ్ అయ్యాడట. అమెరికా లో సెకండ్ వెవ్ మొదలు కావడంతో చిత్ర టీమ్ ఈ నిర్ణయం తీసుకుననట్టుగా తెలుస్తుంది. 

మహేశ్‌ 27వ సినిమా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది.  కరోనా తీవ్రత తగ్గిందని ఆ మధ్యన  సర్కారు వారి పాట సినిమాని  మొదలు పెట్టినా మళ్లీ  కరోనా మహమ్మారి విజృంభణతో  మళ్లీ బ్రేక్ లు పడతాయనే భయంలో ఉందిట టీమ్. దాంతో  మహేష్ బాబు. కరోనా తీవ్రత తగ్గాకే షూటింగ్ అని చెబుతున్నాడట.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios