మహేష్ సినిమాకి హిట్  టాక్ వస్తే ఈ వసూళ్లు పెద్ద లెక్కేం కాదు. మూడు..నాలుగు రోజుల్లోనే సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.  


 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “సర్కారు వారి పాట” .ట్రైలర్ తో హై ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేసిన చిత్రం ఈనెల 12న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికలర్ రైట్స్ 125 కోట్లకు అమ్మడుపోయింది. దాదాపు అన్ని ఏరియాల్లో సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల బిజినెస్ జరగగా..మిగతా ఏరియాల్లో 25 కోట్లు వ్యాపారం జరిగినట్లు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే....

నైజాం- రూ. 36 కోట్లు 
సీడెడ్-రూ.14 కోట్లు 
వైజాగ్-రూ.13 కోట్లు 
ఈస్ట్ గోదావరి - రూ. 8.5 కోట్లు
వెస్ట్ గోదావరి- రూ. 8.5 కోట్లు
కృష్ణా- రూ. 7.5 కోట్లు
గుంటూరు- రూ. 8.5 కోట్లు
నెల్లూరు-రూ. 3.8 కోట్లు
మొత్తం ఆంధ్రా, తెలంగాణా - రూ. 98.5 కోట్లు

కర్ణాటక- రూ. 8.5 కోట్లు
 ఓవర్సీస్- రూ. 11 కోట్లు 
 సర్కారు టార్గెట్ 125 కోట్లు. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 125 కోట్లు షేర్ తప్పక రాబట్టాల్సిందే. 

 మహేష్ సినిమాకి హిట్ టాక్ వస్తే ఈ వసూళ్లు పెద్ద లెక్కేం కాదు. మూడు..నాలుగు రోజుల్లోనే సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. మహేష్ గత సినిమాలు మూడు వరుసగా భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 'భరత్ అనే నేను'.. 'మహర్షి'..'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తున్న మేకర్స్ ఇప్పుడు సినిమా టోటల్ రన్ టైం పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఈ సినిమా మొత్తం 162 నిమిషాల 25 సెకండ్ల పాటు ఉంటుంది అని కన్ఫర్మ్ చేసారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాలో... స‌ముద్ర‌ఖ‌ని విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. త‌మ‌న్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే పాట‌ల‌న్నీ హిట్టు. తెర‌పై ఆ పాట‌లు ఇంకా బాగుంటాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. బుకింగ్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తెలిపారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా మహేష్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.