సినిమాలో డ్యూరేషన్ ప్రాబ్లమ్ వచ్చి ఆపిన పాటను.. సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు సర్కారువారి పాట టీమ్. ఈ సాంగ్ కు అద్భతమైన రెస్పాన్స్ వస్తోంది.
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య మే 12న రిలీజ్ అయిన ఈసినిమా ముందు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆతరువాత కలెక్షన్స్ పరంగా భారీ రెస్పాన్స్ ను సాధించింది. అయితే సర్కారువారి పాట సినిమాలో అన్నింటికంటే హైలెట్ ఈ సినిమా మ్యేజిక్. ఈ సినిమా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తమన్ స్వరపరిచిన బాణీలు ఈ సినిమా సక్సెస్ లో మెయిల్ రోల్ పోషించాయి. ముఖ్యంగా కళావతి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు మ మ మహేశా సాంగ్ కూడా ఒక రేంజ్ లో దూసుకుపోయింది.ఈ రెండు పాటతో సర్కారువారి పాట రిజల్ట్ మారిపోయింది. ఎక్కడ చూసినా కళావతి పాటే వినిపిస్తుంది ప్రస్తుతం. అయితే ఈసినిమా కోసం షూట్ చేసి కొన్ని సీన్స్ తో పాటు ఓపాటు డ్యూరేషన్ ప్రాబ్లమా్ తో సినిమాలో పెట్టలేకపోయారు. ప్రస్తుతం ఆ పాటను విడిగా రిలీజ్ చేశారు.

సర్కారువారి పాట సినిమా కోసం చిత్రీకరించిన మురారివా అనే సాంగ్ ను కొన్ని కారణాల వలన ఉపయోగించలేదు. సినిమా విడుదల తరువాత కొన్ని రోజులకు ఈ పాటను యాడ్ చేశారు. తాజాగా ఆ పాటను యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు టీమ్. మురారివా .. మురారివా .. మురళీ వాయిస్తూ ముడేస్తివా అంటూ సాగే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ పై బ్యూటిఫుల్ సెట్లో ఈ పాటను కలర్ఫుల్ గా చిత్రీకరించారు. సాహిత్యం పరంగా .. ట్యూన్ పరంగా ఓకే. కాకపోతే పరశురామ్ ఈ పాటను ఆపేసి .. ఆ ప్లేస్ లో మాస్ బీట్ గా మ మ మహేశా పాటను పెట్టించాడట. ఆ సిచ్చూవేషన్ కు మహేషా పాట్ కరెక్ట్ గా సూట్ అయ్యింది. ఎందుకంటే ఇంత స్లో సాంగ్ .. అక్కడ ఆ ఫ్లోలో పడితే ఇబ్బందిగానే ఉండేదేమో అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
