సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మొదటి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సైనికులకు ఘన నివాళులర్పిస్తున్న ఈ టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అతని కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ అని కామెంట్స్ చేస్తున్నారు.  

ఇక సినిమాలో మహేష్ ఒక సైనికుడి పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ లుక్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.