మహేష్ బాబు సంక్రాంతి సెన్సేషన్ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ రేసులో ఏ విధంగా దూసుకుపోయిందో అందరికీ తెలుసు.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మహేష్ బాబు ఈ సినిమాలో అజయ్ అనే ఆర్మీ మేజర్ పాత్రలో నటించగా కన్నడ బ్యూటీ రష్మిక మంధన్న మహేష్ బాబు సరసన జంటగా నటించింది.  చాలా ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

 కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుని యాక్షన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కట్టిపడేసే సీన్స్ ఆడియెన్స్‌ చేత సరిలేరు నీకెవ్వరు అనిపించాయి. ఈ సినిమా మహేశ్‌బాబు గత సినిమాల రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమా తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

అదేమిటంటే...2020లో అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు సాధించి ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా దిల్ రాజు, అనిలు సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. 

ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట విషయానికి వస్తే.... కరోనావైరస్ వల్ల ఈ సినిమా ఎప్పుడో మొదలు అవ్వాల్సి ఉన్నా.. బ్రేకు పడిన విషయం తెలిసిందే. అమెరికాలో కరోనావైరస్ తీవ్రతరం అవడంతో ఫారిన్ షెడ్యూల్ రద్దు చేశారు. దీంతో హైదరాబాద్‌లోనే షూటింగ్ కొనసాగతించాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనవరి 2021 నుంచి చిత్రీకరణ మొదలు పెట్టాలని నిర్ణయించారు. షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్ కూడా వేస్తున్నారని సమాచారం.  ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.