2020 సంక్రాంతికి వస్తున్న హై వోల్టేజ్ మూవీ సరిలేరు నీకెవ్వరు కోసం.. సూపర్‌స్టార్ మహేశ్ అభిమానులు ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటిన ఈ మూవీపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఆదివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సరిలేరే నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో ఇటు ఘట్టమనేని అభిమానులు, అటు మెగా ఫ్యాన్స్ వేదిక వద్ద రచ్చ చేస్తున్నారు.

Also Read:తండ్రైన అనిల్ రావిపూడి.. సంతోషంతో మహేష్ ట్వీట్!

రాత్రి ఏడు గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుండగా.. ఫ్యాన్స్ అంతా ఉదయం నుంచే ఎల్‌బీ స్టేడియం వద్ద సందడి చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌‌తో పాటు అతిథులను అలరించేందుకు స్పెషల్ ప్రొగ్రామ్స్‌ ప్లాన్ చేశారు నిర్వాహకులు.

ఈ లిస్ట్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ డ్యాన్స్‌తో ఆకట్టుకోబోతోంది. ఇందుకు సంబంధించి డ్యాన్సర్లతో కలిసి తమన్నా ప్రాక్టీస్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Also Read:ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసిన మహేష్ .. మచిలీపట్నంలో ఏం జరిగిందంటే!

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. చాలా కాలం తర్వాత లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.