సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో ఇచ్చిన సూపర్ హిట్ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ  సినిమాతో బ్లాక్ బస్టర్ గా బాప్ అనిపించుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే హైయిస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రికార్డ్ నెలకొల్పింది. 

సరిలేరు నీకెవ్వరు సినిమా తెలుగులోనే కాదు.. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కూడా రికార్డు టీఆర్పీ సాధించి ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది. మహేష్ కు ఉన్న సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాను కన్నడలో ‘అజయ్ కృష్ణ’ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేసారు. రీసెంట్ గా ఈ సినిమా కన్నడ వెర్షన్‌ను టీవీల్లో ప్రసారం చేస్తే.. మంచి టీఆర్పీ సాధించింది. అంతేకాదు కన్నడనాట తెలుగు డబ్బింగ్ చిత్రాల్లో ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది.  ఈ చిత్రాన్ని కన్నడ వెర్షన్ టెలికాస్ట్ చేయ్యగా 6.5 టీఆర్పీ సాధించింది. 

గతంలో చిరంజీవి నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా 6.3 టీఆర్పీతో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండే. ఇపుడు  మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాగా మొదటి ప్లేస్‌లో నిలిచింది.  మరో ప్రక్క మార్చి 25న ఉగాది పండుగ సందర్భంగా జెమిని ఛానల్ లో ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డు స్థాయిలో టెలివిజన్ వ్యూవర్ షిప్ సాధించింది. 23.4 టీఆర్పీ రేటింగ్స్ సాధించి తెలుగు టెలివిజన్ చరిత్రలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ‘బాహుబలి 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 22.7 టీఆర్పీని దాటేసింది ‘సరిలేరు నీకెవ్వరు’.