గ్రాఫిక్సే ఈ సినిమా ప్రతిభ... ('శరభ' మూవీ రివ్యూ)

ఓ  క్షుద్ర మాంత్రికుడు..అతని శక్తులు మాయలతో కష్టాల్లో పడే హీరోయిన్...అతన్ని ఎదురించే తోట రాముడులాంటి హీరో..

sarabha movie telugu review

--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఓ  క్షుద్ర మాంత్రికుడు..అతని శక్తులు మాయలతో కష్టాల్లో పడే హీరోయిన్...అతన్ని ఎదురించే తోట రాముడులాంటి హీరో...వీళ్ల మధ్య జరిగే విఠలాచార్య మార్క్ కథలు ఆ మధ్యన వచ్చేవి. అయితే ఈ మధ్యన ఎవరూ ధైర్యం చేయటం లేదు. కానీ కన్నడంలో శివరాజకుమార్ హీరోగా  వచ్చి హిట్టైన భజరంగి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో తెలుగులో శరభ అనే సినిమా రూపొందింది ఈ రోజు విడుదలైంది. సూపర్ హిట్ సినిమా రీమేక్ కాబట్టి...కథ,కథనాలు బాగానే ఉంటాయి. అయితే మారుతున్న తెలుగు ప్రేక్షకుడుని ..క్షుద్ర శక్తులు, మాత్రికుడు, బలి ఇవ్వటం వంటి కాన్సెప్టు నచ్చుతుందా..హీరోగా పరిచయమైన కొత్త కుర్రాడు ఎలా చేసాడు..కొత్త డైరక్టర్ ..దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంది..సినిమా ఆడుతుందా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే. 

కథేంటి..

జానపద సినిమాల్లో కనపడే తోట రాముడు లాంటి అల్లరి కుర్రాడు  శరభ (ఆకాష్‌ కుమార్‌). తండ్రి లేకపోవటంతో  ఎంత అల్లరి చేసినా, ఎన్ని తప్పులు చేసినా  తల్లి పార్వతమ్మ (జయప్రధ) వెనకేసుకువస్తుంది. దాంతో మరింత ఉషారుగా.. మావ‌య్య చిన్నారావు(నాజ‌ర్‌), స్నేహితుడితో క‌లిసి  బేవార్స్ గా తిరుగుతూంటాడు. 

మరో ప్రక్క  క్షుద్ర‌ మంత్రోపాసకుడు  చండ్రాక్ష (పునీత్ ఇస్సార్‌)కు శక్తి పెరగటం కోసం, తన క్షుద్ర సామ్రాజ్య స్దాపన కోసం ఆడవాళ్లను బలి ఇస్తూంటాడు. ఆ ప్రాసెస్ లో తను అనుకున్న (18 మంది కావాలి) లెక్క ప్రకారం మరో బలి పెండింగ్ ఉంటుంది. అందుకు తగిన అమ్మాయి కోసం అన్వేషిస్తూంటాడు. అప్పుడు వాళ్ల కంట్లో దివ్య‌(మిస్టీ చ‌క్ర‌వ‌ర్తి) పడుతుంది. ఆమె  సెంట్రల్‌ మినిస్టర్(షియాజీ షిండే) కుమార్తె. పీడ కలలతో ఇబ్బంది పడుతూంటే...   జాతక దోశాలకు ఉన్నాయని   శాంతి కోసం దివ్యను తండ్రి సిరిగిరిపురంలోని గురువు (పొన్‌వన్నన్‌)   దగ్గర విడిపెట్టి వెళతాడు. 

ఆ క్రమంలో గురువు  దివ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను శరభ, పార్వతమ్మలకు అప్పగిస్తాడు. ఇక అక్కడ నుంచి శరభకు, దివ్య కు మధ్య చిన్న చిన్న గొడవలు మొదలై ,ప్రేమతో ముగుస్తుంది.  ఈ లోగా చండ్రాక్ష తన  18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని శరభ అడ్డుకుంటాడు. ఆ క్రమంలో అతనికి తన గతం గురించి ఓ విషయం తెలుస్తుంది. 

తను న‌రసింహస్వామి అనుగ్ర‌హంతో పుట్ట‌బోయే బిడ్డ అని, ఈ విషయం తెలిసిన ఆ మాత్రికుడే తనను చంపాలనుకుని..అడ్డు వచ్చిన తండ్రిని చంపేసాడని అర్దం చేసుకుంటాడు. దాంతో ఆ మాంత్రికుడుని ఎదిరించటం తన కర్తవ్యం అని అర్దం చేసుకుంటాడు. అంతేకాక తమ సంరక్షణలో ఉన్న దివ్యని రక్షించటం తమ భాధ్యత అని బయిలుదేరతాడు. అప్పుడేం జరిగింది.శరక్ష..ఆ మాంత్రికుడుని ఎలా ఎదిరించాడు..అసలు ఆ మాంత్రికుడు దివ్యనే బలికి ఎంచుకోవటం వెనక కారణం ఏమిటి..వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

sarabha movie telugu review

ఎలా ఉంది..

సాధారణంగా కన్నడ సినిమాలు మన తెలుగు సినిమాలకన్నా వెనకబడి ఉంటాయి. మనకు ఎనభైల్లో వచ్చిన ఇలాంటి సినిమాలు ఇప్పటికి అక్కడ వస్తున్నాయంటేనే అర్దం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా అక్కడ హిట్ అవ్వటానికి కారణం ఏదైనా..ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చాలా సీన్స్ చాలా మెలోడ్రామాకు ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే సూపర్ న్యాచురల్ పవర్స్ ని చూపెట్టిన విధానం ఆశ్చర్యంగానూ,వింతగా ఉంటుంది. క్షుద్రోపాసన చెయ్యటం, బలి ఇవ్వటం వంటివి నమ్మబుద్ది కావు.  క్లైమాక్స్ ని భారీగా చూపెట్టాలని చేసే విన్యాసాలు బోరింగ్ గా మార్చేసాయి. కానీ  నరసింహా స్వామి స్వయంగా వచ్చి  విలన్ ని  అంతం చేసే సీన్‌ మాత్రం బాగుంది. అలాగే హీరో,హీరోయిన్స్ మద్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా అసలు పండలేదు. రిలీఫ్ కోసం ఫన్ కూడా పెద్దగా పెట్టలేదు. 

ఇక హీరో ... ఆకాశ‌గంగని తీసుకొచ్చాక జయప్రద  పాత్ర‌లోకి ప్రేతాత్మ దూరి ఆ నీటిని వృథా చేయ‌డం, హీరోయిన్ లోకి కూడా ప్రేతాత్మలు ప్ర‌వేశించి చండ్రాక్ష ఆత్మ‌కి విముక్తి క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నించ‌డం వంటి స‌న్నివేశాలు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. 

విలన్ స్ట్రాంగ్ అయితే..

ఈ సినిమాలో విలన్ పాత్ర తేలిపోయింది. హీరో కు అతను అడుగడుగునా అవాంతరాలు పెడితే..వాటిని తప్పించుకుంటూ వెళ్తే...కథ రక్తి కట్టేది. అలా  లేకపోవటంతో హీరో ఏకపాత్రాభినయంలా సాగిపోయింది.

sarabha movie telugu review

దేవుడే రక్షిస్తే...

సినిమాలో దుష్టశక్తిని సంహరించటానికి సాక్షాత్తూ నరసింహ స్వామే వచ్చేస్తే..ఇంక హీరో ఏం చేసినట్లు. అతని గొప్పతనం ఏముంటుంది. ఆ విషయంలో కాస్త డైరక్టర్ ఆలోచించి కన్నడ వెర్షన్ కు మార్పులు చెయ్యాల్సింది. 

ఎవరెలా చేసారంటే...

జయప్రద రీలాంచ్ సినిమా ఇది. చాలా కాలం తర్వాత ఆమె తెరపై కనిపించింది. సీనియర్ నటిని తీసుకోవటం ఆ పాత్రకు వన్నె తెచ్చింది. ఇక ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యిన ఆకాష్‌ కుమార్‌ యాక్షన్ సీన్స్ లో బాగా చేసినా, నటనా పరంగా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. హీరోయిన్‌ మిస్తీ చక్రవర్తి చేయటానికి పెద్దగా ఏమీలేదు. ఉన్నంతలో బాగా చేసింది. విలన్ గా పునీత్‌ ఇస్సార్‌ ..భయం పుట్టించాడు. 

టెక్నికల్ గా ...

ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ హంగామా ఎక్కువ. VFX టీమ్   వర్క్ బాగా హైలెట్ అవుతుంది. ఆ సీన్సే ఉన్నంతలో బాగున్నాయి. అయితే ఇంటర్నేషనల్ స్దాయి గ్రాఫిక్స్ లేవు కానీ ఈ సినిమాలో ఆ విభాగమే తన ప్రతిభను బాగా చూపించిందని చెప్పచ్చు. పాటలు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. గుర్తుపెట్టుకోదగిన రీతిలో లేదు.  సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. డైరక్టర్ నరిసింహరావు...మెలోడ్రామాతోనూ, ఓవర్ సీన్ యాక్షన్ తోనూ నింపేసారు. తెలుగుకు అంత అతి అక్కర్లేదనే విషయం చూసుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ థాట్

ఈ సినిమా కథ...1970  లో జరుగుతోంది అని ముందు  ఓ కార్డ్ వేసి ఉంటే ...కాస్త నమ్మశక్యంగా ఉండేది.  

రేటింగ్: 2.5/5 

ఎవరెవరు..
న‌టీన‌టులు: ఆకాశ్‌ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్ దీప్ తదితరులు 
మాటలు: సాయి మాధవ్ బుర్రా 
పాటలు: వేద వ్యాస్, రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, అనంత శ్రీరామ్ 
క‌ళ‌: కిరణ్ కుమార్ మన్నె 
పోరాటాలు: రామ్- లక్ష్మణ్ 
ఛాయాగ్ర‌హ‌ణం: రమణ సాల్వ 
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు 
సంగీతం: కోటి 
నిర్మాత: అశ్వని కుమార్ సహదే
రచన-దర్శకత్వం: నరసింహ రావు 
సంస్థ‌: ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్మెంట్ 
విడుద‌ల‌: 22-11-2018

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios