బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ మొదట భార్య కుమార్తె సారా అలీ ఖాన్. ఆనమె తన తాజా చిత్రం కేధారినాధ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కొన్ని టీవీ ఛానెల్స్ కు, వెబ్ మీడియా కు ఇంటర్వూలు ఇస్తోంది. అయితే అన్ని చోట్లా ఒకే ప్రశ్న ఆమెను రిపీట్ గా అడుగుతున్నారట. అదేమింటే..కరీనా కపూర్ తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి చెప్పమంటున్నారట. తన పర్శనల్ లైఫ్ గురించి అలా అడుగూతంటే ఆమెకు చిరాగ్గా ఉంటోందిట. తన తండ్రి రెండో భార్య గురించి అడగటం ఎంతవరకూ సమంజసం అని వాపోతోంది. అయితే కరుణ్ జోహార్ అడిగితే సమాధానం చెప్తారు..మేము అడగకూడదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారట.

ఆ మధ్యన గా కాఫి విత్ కరన్ కార్యక్రమానికి వచ్చింది. అక్కడ ఆమెను ఆ షో నిర్వహిస్తున్న కరణ్ జోహార్ చాలా ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఆమెకు తన పిన్ని వరస అయ్యే కరీనా కపూర్ తో ఉన్న రిలేషన్ గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించాడు.

కరీనాతో తనకున్న అనుబంధం గురించి సారా మాట్లాడుతూ...కరీనా మా నాన్న తో పెళ్లికు ముందే నాతో ..నీకు ఓ తల్లి, ఓ గొప్ప తల్లి  ఉన్నారనేది. మేము ఫ్రెండ్స్ లాగ ఉండేవాళ్లం. మా నాన్న కూడా ఎప్పుడూ ఆమె నీ పిన్ని అని గాని, రెండో అమ్మ అని గానీ చెప్పలేదు అని అంది. అప్పుడు కరణ్ ..మరి కరీనాను ..పిన్నమ్మ లేదా పిన్ని అని పిలుస్తావా అంటే...వెంటేనే నేను కనుక అలా పిలిస్తే ..కరీనాకు నెర్వస్ బ్రెక్ డౌన్ అవుతుంది అని నవ్వేసింది. 

నాకు రెండు ఇళ్లు ఉన్నాయి. అవి రెండు చాలా కంఫర్ట్ బుల్ గా ఉంటాయి. నాన్న, అమ్మ ఇద్దరూ ఇతరులు ఆనందంగా ఉండాలని కోరుకునేవారే. ఇతరుల ఆలోచనలకు గౌరవం ఇచ్చేవారే. ఇద్దరూ ఆనందంగా ఉన్నారు. వాళ్లు కలిసి ఉండాలని ప్రత్యేకంగా కోరుకోవటం లేదు. ఎవరూ ఎవరిపై ఆరోపణలు చేయటం లేదు...సంతోషమేగా అని తేల్చేసింది. 

‘కేదార్‌నాథ్‌’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు సారా అలీ ఖాన్‌. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. అయితే తొలి చిత్రం రిలీజ్‌ కాకాముందే మరో క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నారు సారా. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రన్‌వీర్‌ సింగ్‌ సరసన సింబా చిత్రంలో నటిస్తున్నారు సారా.