ప్రతి ఏడాది ఏప్రిల్ 10న అమెరికా వంటి దేశాల్లో సిబ్లింగ్ డే సెలబ్రేట్ చేస్తుంటారు. ఆరోజు తమ తోడబుట్టిన వారిపై ప్రేమను వ్యక్తపరుస్తూ వారితో కలిసి సమయాన్ని గడుపుతారు. ఇప్పుడు ఈ కల్చర్ ఇండియాకి కూడా పాకింది.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ తోడబుట్టిన వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. నటి సారా అలీఖాన్ కూడా తన లిటిల్ బ్రదర్ కి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పింది. అంతేకాదు.. తన తమ్ముడితో వివిధ సందర్భాల్లో ఆమె దిగిన ఫోటోలను షేర్ చేసింది.

సైఫ్ అలీఖాన్ మాజీ భార్య అమ్రితా సింగ్ కి పుట్టిన సంతానమే సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ లు. వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అనే చెప్పాలి. సారా 'కేథార్ నాథ్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచింది. 'సింబా' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ లో నటిస్తోంది.